Just In
Don't Miss!
- News
సైకో రాములు..18 మంది మహిళలను చంపిన ఘాతకుడు..చిన్న చీటీ ముక్కతో వెలుగులోకి హత్యలు...
- Sports
బుద్ధి లేనోడే గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు రూ.10 కోట్లు వెచ్చిస్తాడు: స్కాట్ స్టైరిస్
- Automobiles
ఇంటర్నేషల్ మార్కెట్లలో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లకు భలే డిమాండ్!
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కన్నుమూసిన సీనియర్ జేమ్స్ బాండ్ నటి.. రోడ్డుపైనే కుప్పకూలిపోయి..
హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది మొదట్లోనే ఒక సీనియర్ నటీమణి ప్రాణాలు విడువడం అందరిని షాక్ కి గురి చేసింది. రోజర్ మూర్‌తో కలిసి 1985 జేమ్స్ బాండ్ చిత్రం "ఎ వ్యూ టు ఎ కిల్" లో స్టాసే సుట్టన్‌గా నటించిన తాన్య రాబర్ట్స్ ఊహించనని విధంగా మరణించారు. ఆమె వయసు 65సంవత్సరాలు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మీడియాలో ఈ న్యూల్ హాట్ టాపిక్ గా మారింది.
కేవలం సినిమాలతోనే కాకుండా పలు టెలివిజన్ షోలతో కూడా మంచి క్రేజ్ అందుకున్నారు. ఇక "దట్స్ 70 షో" లో కూడా నటించిన రాబర్ట్స్ క్రిస్మస్ పండుగ రోజున తన కుక్కలతో కలిసి నడకకు వెళ్లి కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే సన్నిహితులు లాస్ ఏంజిల్స్‌లోని సెడార్-సినాయ్ ఆసుపత్రిలో చేర్చారు. ఇక ఆమె కొలుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ జనవరి 3 ఆదివారం నాడు ఆమె మరణించింది.

అయితే ఆమె మరణానికి అసలు కారణం ఇంకా తెలియరాలేదు. మొదట ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు కొన్ని హాలీవుడ్ మీడియాలలో కథనాలైతే వచ్చాయి. అందుకే ఆమె మరణంకు కోవిడ్-19 కారణమని కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆమె మృతికి అసలు కారణం కోవిడ్ కు సంబంధించినది కాదని మరియు ఆమె పతనానికి దారితీసిన రోజుల్లో రాబర్ట్స్ అనారోగ్య సంకేతాలను చూపించలేదని THR కూడా నివేదించింది.