నకిలీ సెక్స్ టేప్ ప్రచురించిన పత్రిక మీద దావా
గ్రామీ అవార్డు-విజేత బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత పాప్ గాయని అడెల్ తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఓ ప్రెంచ్ పత్రిక మ్యాగజైన్ కవర్ పేజిపై సెక్స్ టేప్‌ని ప్రచురించిందని.. ఆ పత్రిక పై న్యాయపరమైన చర్యలు ప్రారంభించింది. ఈ సందర్బంలో అడెల్ మాట్లాడుతూ పబ్లిక్ మ్యాగజైన్ ప్రచురించిన ఫోటోగ్రాప్స్ నా పరిమిషన్ లేకుండా తీయడమే కాకుండా.. వారి పత్రిక కవర్ పేజిపై నా యొక్క నకిలీ సెక్స్ టేప్‌కి సంబంధించిన ఆరోపణలు నా ప్రతిష్టకు భంగం కలిగించాయి కాబట్టి ఆ పత్రిక ఎడిటర్స్ పై సత్వరమే చర్యలు తీసుకోబోతున్నానని తెలిపింది.
ఈ సందర్బంలో అడెల్ తరుపున న్యాయవాది మాట్లాడుతూ ప్రెంచ్ మ్యాగజైన్ పబ్లిక్ ఆర్టికల్‌లో ప్రచురించినట్లు నా క్లయింట్ ఎటువంటి సెక్స్ టేపులలో నటించలేదు. అదే విధంగా నా క్లయింట్ ఎటువంటి సెక్స్ పూటేజిలలో కనిపించ లేదు. నా క్లయింట్‌పై పత్రిక చేసిన ఆరోపణలు అన్ని కూడా నిరాధారం, అందుకే మేము లీగల్‌గా ఆ ప్రెంచ్ పత్రికపై యాక్షన్ తీసుకోదలచామని అధికారకంగా తెలిపారు.
ఇది ఇలా ఉంటే ఆదివారం లాస్ ఏంజిల్స్‌లో జరిగిన గ్రామీ అవార్డుల కార్యక్రమంలో అడెల్ ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఈ ఉద్వేగానికి కారణం ఆమె గ్రామీ అవార్డుల కార్యక్రమంలో ఆరు గ్రామీ అవార్డులను పొందడమే. 23 సంవత్సరాల వయసు కలిగిన అడెల్ రూపొందించిన పాటల ఆల్బమ్ '21'కి ఈ యేడాది ఉత్తమ ఆల్బమ్ అవార్డుని పొందింది. దీనితో పాటు అడెల్ పాడిన పాట 'రోలింగ్ ఇన్ ద డీప్'కు ఈ సంవత్సరం ఉత్తమ పాట అవార్డుతో పాటు రికార్డు దక్కింది. ఇలా అడెల్‌కు మూడు కేటగిరిలలో గ్రామీ పురస్కారాలు లభించాయి.


Click it and Unblock the Notifications











