twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అండర్ గ్రౌండ్‌లోకి సినీ తారలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ..

    |

    అఫ్గనిస్తాన్ దేశం తాలిబాన్ల ఆధీనంలోకి వెళ్లిన తర్వాత ఆ దేశంలోని పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. ప్రజల జీవితాలు దారుణమైన స్థితిలో జారుకొన్నాయి. ఆ దేశానికి సంబంధించిన సాంస్కృతిక, భాషా వ్యవహారాలు ప్రశ్నార్థకంగా మారాయి. తమ దేశంలో చోటుచేసుకొన్న పరిస్థితులను తాజాగా జరుగుతున్న వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కళ్లకు కట్టినట్టు సినీ ప్రముఖులు వెలుగులోకి తెచ్చారు. ప్రపంచ దేశాల మానవాతీత దృక్పథంతో అఫ్ఘనిస్థాన్ కళాకారులను ఆదుకోవాలని, అలాగే శరణార్థులుగా వారికి చోటు కల్పించాలని ధీనంగా వేడుకొన్నారు.

    అఫ్ఘన్ ఫిల్మ్ ఆర్గనైజేషన్ ప్రసిడెంట్ సాహ్రా కారిమి ఆవేదన వ్యక్తం చూస్తూ.. సంస్కృతి అనే విషయం లేకుండా దేశానికి మనుగడ ఉండదు అంటూ కామెంట్ చేసింది. దేశంలో సినీనటులు, కళాకారులు లేకపోతే మనుగడ ఉంటుందా? సినీ కళాకారులు లేకుండా ఏదైనా దేశం ఉందా? సాంస్కృతిక రంగం లేకుండా గుర్తింపు ఉంటుందా అని సాహ్రా కారిమి అని అన్నారు. సాంస్కృతిక పరంగా దేశాన్ని బలోపేతం చేయడానికి చేసిన అన్ని ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. ఆఫ్ఘనిస్థాన్‌ తాలిబాన్ల నియంత్రణలోకి వచ్చిన తర్వాత ఆ దేశ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది అనే వాదన వినిపిస్తున్నది.

    Bigg Boss Telugu 5: బిగ్ బాస్‌ కంటెస్టెంట్ ఉమాదేవి హాట్ ఫొటోలు.. 'కార్తీక దీపం'లో అలా.. పర్సనల్‌ లైఫ్‌లో ఇలా!Bigg Boss Telugu 5: బిగ్ బాస్‌ కంటెస్టెంట్ ఉమాదేవి హాట్ ఫొటోలు.. 'కార్తీక దీపం'లో అలా.. పర్సనల్‌ లైఫ్‌లో ఇలా!

    అఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు వశపరుచుకొన్న తర్వాత సినిమా షూటింగులు, ప్రీ ప్రొడక్షన్ పనులు, ఫిల్మ్ మేకింగ్ వర్క్‌షాపులు, ఇన్సురెన్స్ పాలసీలు నిలిచిపోయాయి ఆఫ్ఘనిస్థాన్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఇప్పుడు తాలిబాన్ల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఉండాలా? లేదా పారిపోవాలా? అనే సందిగ్ధంలో ఉన్నామని పలువురు కళాకారులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మ్యూజిక్, సృజనాత్మక పనుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సినీతారలు, కళాకారులు ఇప్పుడు నిరాశ్రయులయ్యారు అనే విషయాన్ని మానవ హక్కుల సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

     Afghanistan film Industry in Deep crisis: Film Stars and Artist went underground

    ప్రస్తుత తన పరిస్థితిపై సాహ్రా కారిమి భావోద్వేగానికి లోనైంది. ఆగస్టు 15వ తేదీన నా సంతానం, నా సోదరీ, సోదరులతో ఉన్నాను. కానీ ఇప్పడు నేను ఉక్రేయిన్‌లో శరణార్థిగా తలదాచుకొంటున్నాను అని కన్నీటి పర్యంతమైంది. నాలానే చాలా మంది వేలాది మంది సినీ తారలు, కార్మికులు, సాంకేతిక నిపుణులు తమ ప్రాణాలను చేతిలో పెట్టుకొని దినదిన గండంగా బతుకును వెళ్లదీస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియాలో తమ అకౌంట్లను తొలగించుకొని అండర్‌గ్రౌండ్‌లో తలదాచుకొన్నారు.

    Bigg Boss Telugu 5: మీరెప్పుడు చూడని ఆనీ మాస్టర్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్Bigg Boss Telugu 5: మీరెప్పుడు చూడని ఆనీ మాస్టర్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్

    సమయం చిక్కితే అఫ్ఘనిస్థాన్‌ నుంచి పారిపోవడానికి సిద్దంగా ఉన్నారు. చాలా మంది ఆశావాద దృక్పథంతో అక్కడే ఉంటున్నారు. ఏ క్షణంలోనైనా పరిస్థితులు మారొచ్చు అనే ఆశతో చాలా మంది వేచి చూస్తున్నారు. వెనీస్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న అఫ్ఘనిస్థాన్ సినీ ప్రముఖుల ఇలా తమ దేశంలో నెలకొన్న పరిస్థితులు, సినీ పరిశ్రమ భవిష్యత్తుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Many of Film Stars and Artist went underground in Afghanistan, Afghan Film Organization president Sahraa Karimi says that Now Afghanistan film Industry in deep crisis. Imagine a country without artists, a country without filmmakers. How can they defend its identity?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X