ఆమె మళ్శీ ఆసుపత్రి పాలైంది....!
జసా జసా గబోర్ ఒకప్పటి హాలీవుడ్ అందగత్తె. ఆ రోజుల్లో తన అందచందాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించింది. అలాంటి అందగత్తె ఇంతక ముందు జులైలో యాక్సిడెంట్ లో నడుము విరగడం వల్ల గబోర్ ఆసుపత్రి పాలవడం జరిగినది. ఆ సమయంలో గబోర్ తిరిగి కోలుకోవడానికి నెల రోజులు పట్టింది. మరలా గబోర్ ఇప్పుడు ఆసుపత్రికి రావడం జరిగింది. గబోర్ వయసు 93 సంవత్సరాలు కావడంతో అందరూ చివరి దశలో ఉందని అనుకుంటున్నారు. ఐతే గబోర్ ని ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తి గబోర్ కి ప్లూ లక్షణాలు ఏమైనా ఉన్నాయనే సందేహంతో ప్లూ కి సంబందించిన టెస్టులు కూడా చేయండని డాక్టర్స్ కి చెప్పడం జరిగింది.
డాక్టర్ బ్లాంచెట్ మాట్లాడుతూ ప్రస్తుతం గబోర్ ఆరోగ్యంగా నిలకడగా ఉందని, ఆమె ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని అన్నారు. గబోర్ కి చేయాల్సిన టెస్టులు అన్ని చేయడం జరిగిందని, కోంచం బాడీ పెయిన్స్ ఉన్నట్లు గుర్తంచామని అన్నారు. ఈ రాత్రికే గబోర్ ని ఆసుపత్రి నుండి ఇంటికి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.


Click it and Unblock the Notifications











