»   » 'ఏరోప్లేన్‌ వర్సెస్‌ వల్కనోస్‌' తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్

'ఏరోప్లేన్‌ వర్సెస్‌ వల్కనోస్‌' తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Airplane vs Volcano (2014) releasing in telugu
హైదరాబాద్: హాలీవుడ్ చిత్రాల తెలుగు డబ్బింగ్ లకు తెలుగులో మంచి ఆదరణే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పలు ఆంగ్ల చిత్రాలు తెలుగులోకి వచ్చి విజయవంతమవుతున్నాయి. తాజాగా 'ఏరోప్లేన్‌ వర్సెస్‌ వల్కనోస్‌' చిత్రాన్ని తెలుగులో 'ఆకాశంలో అగ్నిజ్వాలలు'గా తీసుకొస్తున్నారు. డీన్‌ కెయిన్‌, రాబిన్‌ గివెన్స్‌, లారెన్స్‌ హిల్టన్‌ ప్రధాన పాత్రధారులు. జేమ్‌ కాన్‌డెలిక్‌, జాన్‌కాన్‌డెలిక్‌ దర్శకులు. వచ్చే నెల11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

చిత్రం కాన్సెప్టు ఏమిటంటే... మూడు వందల మంది ప్రయాణికులతో ఓ విమానం భూమికి 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. ఇంతలో భూమిపై ఓ అగ్నిపర్వతం పేలి దాని పొగ, సెగ విమానాన్ని తాకాయి. దీంతో విమాన సమాచార వ్యవస్థ దెబ్బతింది. ఈ సమయంలో విమానంలోని ప్రయాణికుల పరిస్థితిని కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన ఆంగ్ల చిత్రం ఇది.

విమానం టేకాఫ్ అయింది. ప్రయాణీకుల్లో కొందరు పుస్తకాల్లో తల దూర్చితే, మరికొందరు నిద్రలోకి మెల్లగా జారుకుంటున్నారు. మరి కొన్ని గంటల్లో గమ్యస్థానం చేరుకుంటామనే ఆనందంతో ఇంకొందరు ప్రయాణీకులు కబుర్లలో మునిగారు. విమానం మరింత ఎత్తుకు లేచింది.. 30 వేల అడుగుల ఎత్తు అది. అంత ఎత్తుకు వెళ్లడం సహజమే. అయితే పైలెట్ పొరపాటు కారణంగా అగ్నిశిఖలు ఉండే ప్రదేశానికి దగ్గరగా విమానం వెళ్లడంతో ఊహించని ప్రమాదం ఎదురైంది. కాసేపటికి కానీ మరణం ముంగిట ఉన్నామనే చేదునిజం ప్రయాణీకులకు అర్థం కాలేదు. అంతే. భయంతో కేకలు పెట్టేవారు కొందరు, దేవుణ్ణి ప్రార్థించుకొనేవారు మరికొందరు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ విమానంలోనే ఉన్న ఎయిర్‌ఫోర్స్ అధికారి ఎలా స్పందించి వారిని కాపాడాడన్న ఇతివృత్తంతో 'ఏరోప్లేన్ వర్సెస్ వల్కనోస్' చిత్రం హాలీవుడ్‌లో రూపుదిద్దుకొంది.

ఈ సినిమాని 'ఆకాశంలో అగ్నిజ్వాలలు' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు ముత్యాల రామదాసు. శ్రీవెంకటసాయి ఫిలిమ్స్ పతాకంపై తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారాయన. 'ఇటీవల జరిగిన మలేసియా విమానప్రమాద విషాద సంఘటన ఎంతమందిని కలిచివేసిందో మన అందరికీ తెలుసు. ఆ విమానప్రమాదం ఎలా జరిగిందో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎవరి ఊహాగానాలు వారివి. అలాగే ఈ సినిమాలో కూడా విమానప్రమాదం ఊహకు అందని విధంగా ఉంటుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సినిమా ఉంటుంది. ఏప్రిల్ 4న విడుదల చేస్తున్నాం' అని తెలిపారాయన. డీన్ కెయిన్, రాబిన్ గివెన్స్, లారెన్స్ హిల్టన్ జాకబ్స్, మాట్ మార్సెర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి జేమ్స్ కాన్‌డెలిక్, జాన్ కాన్‌డెలిక్ దర్శకత్వం వహించారు.

English summary
Airplane vs Volcano (2014) about...When a commercial airliner is trapped within a ring of erupting volcanoes, the passengers and crew must find a way to survive - without landing. But when the relentless onslaught of lava and ash causes fear and distrust amongst those onboard, it isn't just the volcanoes that are life-threatening. Everyone must learn to work together if they are to survive their epic flight of fire.
Please Wait while comments are loading...