Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జేమ్స్ బాండ్ కు ఎదురొడ్డే భారతీయ గూఢాచారిగా 'ఐష్'
ఇటీవలే జేమ్స్ బాండ్ సినిమాలో బాండ్ గర్ల్ గా స్లమ్ డాగ్ పిల్ల ఫ్రిదా పింటోను తీసుకున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆ వార్తలన్నీ రూమర్స్ అని తేలిపోయాయి. తాజాగా ఈ సినిమాలో బాండ్ గర్ల్ గా మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నెం.1 హీరోయిన్ అందాల ఐశ్వర్యారాయ్ ను ఎన్నుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
శ్యామ్ మెండీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ 23వ బాండ్ సినిమాలో డేనియల్ క్రెగ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కథనం ప్రకారం జేమ్స్ బాండ్ తన మిషన్ లో భాగంగా ఈ సారి ఇండియా వస్తాడట. ఈ సినిమా షూటింగ్ చాలా భాగం ఇండియాలోనే జరగనుంది. ఇందుకోసం లొకేషన్ల అన్వేషన కూడా మొదలయింది. దీంతో కథానాయిక కూడా ఇండియన్ అయితే బాగుంటుందని భావించిన శ్యామ్ ఇందుకోసం ఇండియాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యారాయ్ అయితే నాయికగా బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించారట. ఈ విషయమై ఇంకా ఆమె నిర్ణయం తీసుకోలేదట. ఐష్ ఇంతకు ముందు పింక్ ప్యాంథర్2, ప్రొవోక్డ్, ది లాస్ట్ లీజియన్ వంటి హాలీవుడ్ సినిమాల్లో నటించి అక్కడి వారికి సుపరిచితులయ్యారు.
మరి జేమ్స్ బాండ్ సినిమా అంటేనే నాయిక అంగాంగ ప్రదర్శనలు, సెక్సీ సన్నివేశాలే ముందుగా గుర్తొస్తాయి. మరిందులో ఐష్ ఎలా జీవిస్తుందో.. ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే..