twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కి ప్రేరణగా నిలిచిన ఐశ్యర్య

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిలా జోవోవిచ్ 2008వ సంవత్సరంలో బాలీవుడ్‌లో విడుదలైన 'జోధా అక్బర్'లో ఐశ్యర్యరాయ్ నటించిన నటనకు గాను వందకు వంద మార్కులను వేశారు. మార్కులు వేయడమే కాదండోయ్ ఆ సినిమాలో ఐశ్యర్యరాయ్ చేసినటువంటి సాహాసాలు, కత్తి తిప్పడాలే తను కొత్తగా నటించిన త్రీ మస్కటర్స్ సినిమాలో ప్రేరణగా నిలిచాయని తెలిపారు. ఈ సందర్బంలో మిలా జోవోవిచ్ మాట్లాడుతూ నేను జోధా అక్బర్ సినిమాని చూడడం జరిగింది. ఆ సినిమాలో ఐశ్యర్య నటించిన యాక్షన్ సీన్లుకు గాను ఆమె చేసిన నటన అధ్బుతమని కొనియాడారు.

    మిలా జోవోవిచ్, ఓర్మాల్డ్ బ్రూమ్ తదితరులు ప్రధాన తారగణంగా హాలీవుడ్‌లో ఇటీవలే త్రీ మస్కటర్స్ అనే సినిమా విడుదలై బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేస్తుంది. ఈ సందర్బంలో త్రీ మస్కటర్స్ సినిమా ప్రమోషన్‌లో పాల్గోన్న మిలా జోవోవిచ్ జోధా అక్బర్ సినిమాలో ఐశ్యర్య తన పాత్రకు సరైన న్యాయం చేశారని అన్నారు. సరిగ్గా అలాంటి యాక్షనే నేను త్రీ మస్కటర్స్‌లో చేయడం జరిగింది.

    త్రీ మస్కటర్స్ సినిమాలో 'మిలా జోవోవిచ్ మైలేడీ డీ వింటర్' అనే పాత్రను పోషించారు. త్రీ మస్కటర్స్ అయిన ఫోతోస్, ఆథాస్, అరామిస్ ముగ్గురు కలిసి ఫ్రాన్స్ రాజు ప్రాణాలను కాపడడమే కాకుండా రాజ్యంలో జరిగేటటువంటి కుట్రలు, కుతంత్రాలను చేధించడం జరుగుతుంది.

    English summary
    Hollywood actress Milla Jovovich was so impressed with Aishwarya Rai's sword fight in 2008 blockbuster “Jodhaa Akbar” that she tried to be like her in her new movie “The Three Musketeers”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X