ఒళ్లు అమ్ముకొన్న 'గాడ్ ఫాదర్' అల్ ప్యాసినో
హాలీవుడ్ నటుడు 'గాడ్ ఫాదర్' అల్ ప్యాసినో ఇటీవల తన జీవితంలోని చీకటి కోణాన్ని ఆవిష్కరించాడు. సినిమాల్లో నటించాలనే కోరికతో చదువును మధ్యలోనే వదిలేసి, నటుడిగా నిలబడాలనే ప్రయత్నంలో తిండి, గూడు కోసం తన శరీరాన్ని అమ్ముకున్నానని చెప్పుకొచ్చాడు. వివరాల్లోకి వెళ్తే అల్ ప్యాసినో నటుడిగా నిలబడాలని ఇటలీ దేశంలో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తిండి, గూడుకు కూడా కరువయిందట. దీంతో చేసేది లేక తన దగ్గరున్న ఏకైక ఆస్తి తన శరీరాన్ని అమ్ముకోవాలని నిర్ణయించుకున్నాడట. అందుకు తగ్గట్టుగానే ఓ ముసలావిడ తన కోరిక తీర్చితే ఇంట్లో వుండటానికి అనుమతించి, తిండి పెట్టడానికి ఒప్పుకొందట. ఇక చేసేది లేక అందుకు సిద్ధపడ్డాడట. దీనికి తాను అప్పుడప్పుడు బాధపడుతుంటానని చెప్పాడు. న్యూయార్క్ పోస్ట్ ప్రచురించిన ఈ వార్త సంచలనం సృష్టించింది.
'గాడ్ ఫాదర్' చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని, 'సెంట్ ఆఫ్ ఎ ఉమన్' చిత్రానికి అకాడమీ అవార్డును సొంతం చేసుకున్న గొప్ప నటుడి జీవితంలో ఇలాంటి చీకటి కోణం వుంటుంది అని ఎవ్వరూ ఊహించి వుండరు. కానీ కష్టాలు పడ్డవారెప్పుడు చెడ్డవారు కాలేదు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











