ఆ హాలీవుడ్ హాట్ జంట విడిపోయిందా??
హాలీవుడ్ హాట్ మోడల్ క్యాటీ ప్రైజ్, బాక్సర్ అలెక్స్ రెయిడ్ గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా అలెక్స్ రెయిడ్ క్రాస్ డ్రస్సర్ అని వచ్చిన వార్తలు, ఆ తర్వాత క్యాటీ తన భర్త పీడర్ ఆండ్రీ నుండీ విడాకులు తీసుకోవడం లాంటి పరిణామాలతో పాటుగా, ప్రస్తుతం తాజాగా వీరిద్దరూ విడిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఇంత కాలం తనతో కలసి వుంటున్న రెయిడ్ ను తన భవనం ఖాళీ చేసివెళ్లిపోవాలని క్యాటీ కోరిందట. దీంతో చేసేది ఏం లేక రెయిడ్ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడట.
కానీ క్యాటీ ప్రైజ్ ఈ వార్తలను కొట్టిపడేసింది. అవన్నీ గాలి వార్తలేనని తామిద్దరం కలిసే వున్నామని చెప్పింది. దీనిపై క్యాటీ సన్నిహితులు స్పందిస్తూ రెయిడ్ త్వరలో ఓ బాక్సింగ్ పోటీలో పాల్గొనబోతున్నాడు. దీనికోసం శిక్షణ నిమిత్తం వారి తల్లిదండ్రుల వద్ద వుంటున్నాడని, క్యాటీ ప్రైజ్ కూడా తన పుస్తకం ప్రమోషన్ నిమిత్తం స్కాట్ ల్యాండ్ వెళ్తోందని కాబట్టి తాత్కాలికంగా విడిపోతున్నారే కానీ వారిద్దరూ విడిపోలేదని స్పష్టం చేసారు.


Click it and Unblock the Notifications











