ఆమె కోసం అతను.. ఇంకొకరి కోసం ఆమె..!!

By Kuladeep

ప్రముఖ మోడల్ క్యాటీ ప్రైజ్ కోసం తాను చావడానికి కూడా సిద్ధంగా వున్నానని ఆమె బాయ్ ఫ్రెండ్ అలెక్స్ రెయిడ్ చెబుతున్నాడు. లండన్ లో జరుగుతున్న బిగ్ బ్రదర్స్ రియాలిటీ షోలో పాల్గొనడానికి ముందు ఆమె అతనికి తన గురించి రియాలిటీ షోలో ఎక్కడా మాట్లాడకని చెప్పినప్పటికీ అతను ఆమె గురించి రోజూ ఏదో ఒకటి మాట్లాడుతూనే వున్నాడు. తాజాగా ఆమె కోసం తాను చావడానికి సైతం సిద్ధంగా వున్నానని అతను తన రూం మేట్స్ కు చెప్పుకొచ్చాడు. అసలు క్యాటీ తో నువ్వెందుకు కలసి వుంటున్నావని అతని మేట్స్ అడగటంతో ఆయనీ విధంగా సమాధానమిచ్చాడు. తనదీ క్యాటీది ఎన్నో జన్మలబంధంగా అనిపిస్తుందని ఆయన స్పష్టం చేసాడు.

కానీ క్యాటీ ప్రైజ్ మాత్రం తను చెప్పిన ఏ ఒక్క నిబంధననూ పాటించని అలెక్స్ రెయిడ్ ను వదిలేసి ఇంకొకరితో బంధాన్ని ఏర్పచుకుందామని తెగ ఆరాట పడుతోందట. ఫుట్ బాల్ ప్లేయర్ జర్మెయిన్ డెఫోతో డేటింగ్ కోసం తెగ ప్రయత్నిస్తోందని, అతనికి వరసబెట్టి sms లు పంపుతోందని సమాచారం, కాగా ఈమె సన్నిహితులు క్యాటీ జర్మెయిన్ తో రహస్యబంధాన్ని నడుపుతోందని, రియాలిటీ షో నుండీ బయటకు రాగానే రెయిడ్ ను ఇంటికి పంపేస్తుందని ఆమె సంబంధీకులు వ్యాఖ్యానిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X