ప్రియున్ని ముంచే పనిలో జోర్డాన్
అసలు తనని వదిలేయడానికే తన ప్రియురాలు జోర్డాన్ తను 'క్రాస్ డ్రస్సర్' అనే విషయాన్ని బయటపెట్టిందని ఆమె ప్రియుడు బాక్సర్ కమ్ యాక్టర్ అలెక్స్ రెయిడ్ ఆవేదన వ్యక్తం చేసాడు. తన ప్రియురాలు జోర్డాన్ ఓ పథకం ప్రకారం తానో 'క్రాస్ డ్రస్సర్' అనే విషయాన్ని అందరికీ చెప్పి రాద్దాంతం చేస్తున్నారని ఆదోళన చెందుతున్నాడు.
జోర్డాన్ తనని వదిలించుకొనేందుకు ప్రయత్నిస్తోందని, దీనిపై ఎవ్వరూ తనని తప్పుపట్టకూడదనే ఈ విధంగా చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చూపిస్తోందని, మరీ ఆమె ఇంత నిర్దయగా ప్రవర్తిస్తుందని అనుకోలేదని, తాను ఆమె ఉచ్చులో పడ్డ కీటకంలా కొట్టుమిట్టాడుతున్నాని తన బాధను వెలిబుచ్చాడు. కానీ వీటిపై స్పందించడానికి జోర్డాన్ సిద్ధంగా లేదనీ, అయితే రెయిడ్ అమ్మాయివేషధారణలో వున్న చిత్రాలను జోర్డాన్ అమ్మకానికి పెట్టనుందనే వార్తల్లో నిజం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయినా పొమ్మనక పొగ పెట్టడం కంటే పొమ్మని చెప్పడమే ఉత్తమమని జోర్డాన్ కు చెప్పేవారే లేరా!!!


Click it and Unblock the Notifications











