ఉపన్యాసం దంచేసిన ప్రధానమంత్రి కావాలనుకుంటున్న నటుడు
క్యాటీ ప్రైజ్ ను పెళ్లిచేసుకోకముందే బిగ్ బ్రదర్స్ రియాలిటీ షోలో విజేతగా నిలిచి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు, బాక్సర్ అలెక్స్ రెయిడ్. తాజాగా ఈయన మీడియాతో మాట్లాడుతూ తనకు బ్రిటన్ కు ప్రధానమంత్రి కావాలని ఆశగా వుందని చెప్పుకొచ్చాడు. ఈ ప్రపంచం మొత్తం అనురాగాలతో కాకుండా ద్వేషాలతో రగిలిపోతోందని..అలాంటి ప్రపంచాన్ని మార్చడానికి తను ప్రధాని అవ్వాలని అనుకుంటున్నానని చెప్పాడు.
అంతే కాదు తను జీసస్ మరియు మహాత్మ గాంధీ లాగా శాంతి దూతనని ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటుంటే ఏమొస్తుంది.. ప్రేమగా మెలగాలి అప్పుడే ప్రపంచం ప్రశాంతంగా వుంటుంది అని ఉపన్యాసం దంచేసాడు.
అలెక్స్ రెయిడ్ క్యాటీ ప్రైజ్ పీటర్ ఆండ్రీ హాలీవుడ్ ప్రధానమంత్రి బ్రిటన్ alex reid katie price peter andre hollywood prime minister britain


Click it and Unblock the Notifications