ఆమెను తల్లిని చెయ్యాలని వుంది
ప్రముఖ మోడల్ క్యాటీ ప్రైజ్ బాయ్ ఫ్రెండ్ బాక్సర్ అలెక్స్ రెయిడ్ తనకు క్యాటీ ప్రైజ్ తో పిల్లలను పొందాలని వుందని తన కోరికను బయటపెట్టాడు. జులై, 2009 నుండీ ఈ ముద్దుగుమ్మతో డేటింగ్ చేస్తోన్న రెయిడ్ ఇటీవలే సండే మిర్రర్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాన్ని వెళ్లడించాడు. ఇంటర్యూలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా "తనకు క్యాటీ ప్రైజ్ తో జీవితం చాలా సంతోషంగా గడచిపోతోందని, ఆమెతో కలసి జీవితాంతం వుండిపోవాలని వుందని, త్వరలోనే ఆమెతో పిల్లలను పొందాలని వుందని, ఇది మరెంతో దూరంలో లేదని, త్వరలోనే తన కోరిక తీరనుందని" చెప్పుకొచ్చాడు.
కాగా క్యాటీ ప్రైజ్ తన భర్త పీటర్ ఆండ్రీ నుండీ విడిపోయిన విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. వీరిద్దరిలో ఓ కొడుకు స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో క్యాటీ ప్రైజ్ తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని తన బిడ్డ క్షేమానికై తల్లడిల్లిపోతోందట. ఇంతా జరిగినా క్యాటీ ఈ విషయాన్ని ఆ బిడ్డ తండ్రి అయిన పీటర్ కు చెప్పకపోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











