మరో సారి బాక్సాఫీసును కొల్లగొట్టిన సినిమా..
హాలీవుడ్ లో 3డి చిత్రాలకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. అవతార్ సృష్టించిన ప్రభజనంతో 3డి సినిమాల మీద వున్న ఆశక్తిని దృష్టిలో వుంచుకొని రూపొందిన మరో 3డి సినిమా 'అలైస్ ఇన్ వండర్ ల్యాండ్' సినిమా అందరి అంచనాలనూ అందుకొని రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. ఇంతకు ముందు అవతార్ పేరుమీదున్న అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకున్న 3డి చిత్రం రికార్డును ఈ సినిమా అధికమించింది.
ఇక బాక్సాఫీసు వద్ద ఈ సినిమా వరుసగా మూడవ సారి తొలి స్థానాన్ని దక్కించుకుంది. మొత్తంగా 34.5 మిలియన్ డాలర్లు వసూళు చేసిన ఈ సినిమా ఈ ఘనతను సాధించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టించిన అవతార్ సినిమా నాలుగు మిలియన్ డాలర్లను వసూలు చేసి ఎనిమిదవ స్థానానికి దిగజారిపోయింది.
More from Filmibeat
హాలీవుడ్ జానీ డెప్ అవతార్ బాక్సాఫీసు జేమ్స్ కామెరూన్ alice in wonderland johnny depp avatar box office hollywood james cameron


Click it and Unblock the Notifications











