twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా కాటుకు మరో ప్రముఖ నటుడు మృతి.. అమెరికాలో దారుణంగా..

    |

    కరోనావైరస్ కాటుకు మరో హాలీవుడ్ నటుడు బలయ్యాడు. ఏలియన్స్, ఎమ్మెర్డేల్ లాంటి టెలివిజన్ షోలతో ఆకట్టుకొన్న జే బెనెడిక్ట్ కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. కరోనావైరస్ సోకడం ద్వారా తలెత్తిన సమస్యలతో బాధపడుతూ ఆయన మరణించారని అధికారికంగా ప్రకటన వెల్లడైంది. అయితే తన 69వ బర్త్ డేకు ముందు రోజు అంటే ఏప్రిల్ 4వ తేదీన మరణించడం అత్యంత విషాదకరంగా మారింది.

    బెనెడిక్ట్ సన్నిహితులు ఆయన మరణంపై స్పందిస్తూ.. జే లేరనే వార్తను తెలియజేయాల్సి రావడం అత్యంత బాధాకరం. కొవిడ్ 19 ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన మరణించారు అని ఓ ప్రకటనలో తెలిపారు. జేకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

    Aliens fame actor Jay benedict died with Covid19

    హాలీవుడ్‌లో నాలుగు దశాబ్దాలకుపైగా కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించాడు. ప్రముఖ దర్శకుడ జేమ్స్ కామెరాన్ రూపొందించిన ఏలియన్స్ అనే సైంటిఫిక్ ఫిక్షన్ చిత్రంలో రస్ జోర్డాన్ అనే పాత్రలో అత్యంత ప్రజాదరణను కూడగట్టుకొన్నారు. ది డార్క్ నైట్‌లో జాన్ కీఫర్ పాత్రలో యూఎస్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించారు. ఫోయ్లేస్ వార్ అనే బ్రిటీష్ డ్రామాలో క్రిస్టఫర్ అనే డిటెక్టివ్ పాత్రలో కనిపించారు.

    English summary
    Actor Jay Benedict has passed away due to complications arising from the coronavirus. He was 68. Benedict's management team said, "It is with profound sorrow that we must announce Jay's death on the 4th of April due to complications arising from a COVID-19 infection.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X