డ్రగ్స్ తీసుకున్న హీరోయిన్, అరెస్ట్
న్యూయార్క్ : అమెరికన్ హాట్ బ్యూటీ, హాలీవుడ్ తార అమండా బైన్స్‌ను పోలీసులు అరెస్టు చేసాడు. మారిజూనా(గంజాయి లాంటి మత్తు పదార్థం) అనే డ్రగ్ తీసుకుందనే ఆరోపణలతో ఆమె చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు న్యూయార్క్ పోలీసులు. మిడ్ టౌన్ మాన్‌హట్టన్‌లోని తన అపార్టుమెంటులో అమండా బైన్స్ మారిజూనాను స్మోక్ చేస్తుందనే కంప్లైంట్ అందుకున్న పోలీసులు అపార్ట్ మెంటులో ఆమె నివాసం ఉంటున్న 36వ అంతస్తులోని ప్లాటుకు చేరుకున్నారు.
అప్పటికే అక్కడ పోలీసులు మారిజూనా స్మోక్ ఉన్నట్లు గుర్తించారు. పోలీసులను చూడగానే అమండా బైన్స్ తన చేతిలో ఉన్న బాంగ్ (డగ్స్ సేవించడానికి ఉపయోగించే గొట్టం) కిటీకి గుండా బయటకు విరిసింది. తమ కళ్ల ముందే అమండా బైన్స్ మారిజూనా తీసుకున్నట్లు రుజువు కావడంతో పోలీసులు ఆమె చేతికి బేడీలు వేసి తీసుకెళ్లారు.

ఇటీవల అమండా...ట్విట్టర్లో అభిమానులకు అందాల ప్రదర్శనతో కను విందు చేసింది. బాత్రూంలో ఒంటిపై ఉన్న బట్టలు తీసేని టాప్ లెస్‌గా తన సెల్ ఫోన్‌తో తనకు తానుగా తీసుకున్న ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేసింది. అమండాకు డ్రగ్స్ అలవాటు ఉందని తేలడం, అరెస్టవడంతో అభిమానులు షాక్ షాకయ్యారు.


Click it and Unblock the Notifications











