twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమెను సెక్సువల్‌గా వేధించిన ఆ కమెడియన్ ఎవరు?

    By Bojja Kumar
    |

    Amanda Holden
    లండన్: బ్రిటన్ నటి అమండా హోల్డన్ చాలా ఏళ్ల తర్వాత తాను ఎదుర్కొన్న ఓ దుర్ఘటన గురించి బయపెట్టింది. ఓ ప్రముఖ కమెడియన్ ఆమెను సెక్సువల్‌గా వేధించాడట. తన మొదటి భర్త లెడ్ డెన్నిస్‌ను పెళ్లి చేసుకున్న కొత్తలో ఈ ఘటన చోటు చేసుకుందట. 42 ఏళ్ల ఈ నటి తన ఆత్మకథలో అమండా ఈ విషయాన్ని వెల్లడించినట్లు డైలీస్టార్ అనే ఇంటర్నేషనల్ పత్రిక వెల్లడించింది.

    అయితే ఆ ఫేమస్ కమెడియన్ ఎవరు? అనే విషయాన్ని మాత్రం అమండా బయటకు వెల్లడించలేదు. ఓ పబ్లిక్ ఈవెంటుకు వెళ్లి వస్తుండగా సదరు కమెడియన్ ఆమెను టార్గెట్ చేసి సెక్సువల్‌గా వేధించాడని, ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడంతో పాటు వేయకూడని చోట చేతులు వేసాడట.

    అయితే అప్పుడు ఆమె ఈ విషయాన్ని బయట పెట్టి పెద్ద సీన్ చేసుకోవడం ఇష్టం లేక మిన్నకుండిపోయిందట. కాగా...లెడ్ డెన్నిస్‌ను 2003లో విడిపోయిన అమండా హోల్డెన్ ఆతర్వాత మ్యూజిక్ ప్రొడ్యూసర్ క్రిస్ హగ్గెస్‌ను పెళ్లాడింది. బ్రిటన్లో ప్రముఖ నటి అయిన అమండా హోల్డెన్ ఈవిషయం బయట పెట్టడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

    English summary
    Amanda Holden has revealed that a famous comedian had sexually assaulted her while she was married to Les Dennis. The 42-year-old actress wrote in her autobiography that she kept this incident a secret as she didn't want her then husband to create a scene, the Daily Star reported.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X