''ది అమేజింగ్‌ స్పైడర్‌ మాన్‌-2'' మొదట మనకే

By Srikanya

‘Amazing Spider-Man 2′ to Open in India Before U.S.
లాస్ ఏంజిల్స్ : హాలీవుడ్‌ చిత్రం ''ది అమేజింగ్‌ స్పైడర్‌ మాన్‌-2'' సినిమా అమెరికా కన్నా ముందే మనదేశంలో మే 2న విడుదల కానుంది. భారత్‌లో ఇంగ్లీషుతో బాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని 2-డి, 3-డి, ఐమాక్స్‌-3డి వర్షన్లో విడుదల చేస్తున్నారు. స్కూళ్ళకు,కాలేజీలకు సెలవులు కావడం ఈ చిత్ర విజయానికి సహకరిస్తుందని సోనీ పిక్చర్స్‌ యజమాని దారువాలా అభిప్రాయపడుతున్నారు. మే ఒకటవ తేదీని విడుదల తేదీగా నిర్ణయించారు.

ఈ సినిమా మొదటి వర్షన్‌ తొలుత 2012లో భారత్‌లో విడుదలైనప్పుడు 34 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఈ సూపర్‌ హీరో మార్వేల్‌ కామిక్‌ చిత్రానికి కొలంబియా పిక్చర్స్‌ తరఫున మార్క్‌ వెబ్‌ దర్శకత్వం నిర్వహిస్తున్నాడు. జేమ్స్‌ వాండర్‌ బిల్ట్‌ తొలుత ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే సమకూర్చగా, దాన్ని అలెక్స్‌ కుర్జ్‌ మ్యాన్‌ తిరగరాశాడు.

అండ్రూగార్ఫీల్డ్‌, ఎమ్మా స్టోన్‌, కాంప్బెల్‌ స్కాట్‌ ఇందులో ముఖ్య తారాగణం. మనదేశంలో ఈ చిత్రాన్ని మొదట విడుదల చేసాక అమెరికాలో విడుదల చేసే తేదీని ప్రకటిస్తారు. ఈ సినిమాకు రెండు సీక్వెళ్లను నిర్మించాలని కొలంబియా సంస్థ యోచిస్తోంది. మూడో సీక్వెల్‌ చిత్రాన్ని జూన్‌ 2016లో, నాలుగో సీక్వెల్‌ చిత్రాన్ని 2018లో విడుదల చేసే ప్రణాళికను నిర్మాతలు ఖరారు చేసారు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ స్పైడర్ మ్యాన్ చిత్రాలకు గల క్రేజ్‌ను, అంచనాలను దృష్టిలో పెట్టుకోని ఇప్పటివరకు వచ్చిన స్పైడర్ మ్యాన్ చిత్రాలను మరిపించేలా 'ది ఎమేజింగ్ స్పైడర్ మ్యాన్ -2 'ని రూపొందించాం అని అన్నాడు. సోని పిక్చర్స్ ప్రతినిధి ఈ చిత్రం విడుదల గురించి మాట్లాడుతూ స్పైడర్ మ్యాన్ చిత్రాలకు ప్రేక్షకుల్లో గల విశేష్ ఆదరణను దృష్టిలో పెట్టుకోని 'ది ఎమేజింగ్ స్పైడర్ మ్యాన్' సినిమాని తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం అని అన్నారు. సరిక్రొత్త సాహాస కృత్యాలతో రూపొందించిన ఈ సినిమా అభిమానులకు ఓ అనుభూతిని మిగుల్చుతుంది. టైటిల్‌లో ఉన్న అమేజింగ్ అనే పేరుకు తగ్గట్లే ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది. ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X