ఇంటర్నెట్లో 'అమేజింగ్ స్పైడర్ మ్యాన్' ట్రైలర్ హాల్ చల్
స్పైడర్ మ్యాన్ సాహాసాలకు మారు పేరు. గతంలో చూసిన స్పైడర్ మ్యాన్ సినిమాలకు విభిన్నంగా ఉంటుందని అంటున్నారు 'అమేజింగ్ స్పైడర్ మ్యాన్' చిత్ర నిర్మాతలు. 'అమేజింగ్ స్పైడర్ మ్యాన్' సినిమాకు సంబంధించిన అఫీసియల్ ట్రైలర్ ఇప్పడు ఇంటర్నెట్లో ఓ కొత్త సంచలనంగా ఉంది. ఈ ట్రైలర్‌ని చూసిన వారంతా నిర్మాతలు చెప్పిన దాంట్లో వంద శాతం నిజం ఉందని అంటున్నారు.
'ద సోషల్ నెట్‌వర్క్' సినిమా స్టార్ హీరో అయిన 'ఆండ్రూ గార్ఫీల్డ్' మొదటి సారిగా స్పైడర్ మ్యాన్ లీడ్ రోల్‌ని కొలంబియా పిక్చర్స్ పతాకంపై నటిస్తున్నారు. గతంలో పీటర్ పార్కర్ పాత్రకు గాను 'టోబే' నటించిన విషయం తెలిసిందే. 10 సంవత్సరాల క్రితం మొదటి స్పైడర్ మ్యాన్ చిత్రం థియేటర్లలో విడుదలై హిట్ అయినప్పడు ఎలాంటి ఉద్వేగానికి లోనయ్యారో ఈ 'అమెజింగ్ స్పైడర్ మ్యాన్' సినిమా రిలీజ్ అప్పడు అలాంటి ఉద్వేగానికి లోనవుతారని ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్బంగా తెలిపారు.
సో అందరూ ఎంతో అతృతగా ఎదురు చూస్తున్న అమేజింగ్ స్పైడర్ మ్యాన్ సినిమా ఈ వేసవిలో అభిమానుల ముందుకు రానుందని అన్నారు. ఎమ్మా స్టోన్, ఆండ్రూ గార్ఫీల్డ్, రిస్ ఇఫాన్స్, మార్టిన్ షీన్, బెన్ పార్కర్ ముఖ్య తారాగణంగా మార్చి 7వ తారీఖున ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











