»   » 500 కోట్ల బడ్జుట్ మూవీ 'అమెజాన్‌ యోధులు' తెలుగులో...

500 కోట్ల బడ్జుట్ మూవీ 'అమెజాన్‌ యోధులు' తెలుగులో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ హాలీవుడ్‌ నటులు రిచాజెన్‌, సెసిలియా చియాంగ్‌ జంటగా ఇండో ఓవర్సీస్‌ బ్యానర్‌పై ఫ్రాంకీఛాన్‌ దర్శకత్వంలో 500 కోట్ల భారీ బడ్జెట్‌లో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌లో జాకీచాన్‌ నిర్మించిన చిత్రం 'ది లెజండరీ అమెజాన్స్‌'.

ఈ చిత్రం హాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసి భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని సాయి శ్రీజ విఘ్నేష్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై జి.వంశీకృష్ణ వర్మ 'అమెజాన్‌ యోధులు' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. 'మాహిష్మతి రాజ్యం' ఉపశీర్షిక. దీపావళి కానుకగా అక్టోబర్‌ 29న ఈ చిత్రం రిలీజవుతోంది.

Amazon Yodhulu movie releasing in Telugu

ఈ సందర్భంగా నిర్మాత జి.వంశీకృష్ణ వర్మ మాట్లాడుతూ - ''ప్రముఖ హాలీవుడ్‌ నటుడు జాకీచాన్‌ 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. హాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచి సరికొత్త రికార్డ్‌లు నెలకొల్పింది. తెలుగు ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఈ చిత్రం వుంటుంది. 'బాహుబలి' చిత్రం తరహాలో ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాలు భారీగా వుంటాయి. యాక్షన్‌ సీన్స్‌ అన్నీ చాలా థ్రిల్లింగ్‌గా వుంటాయి.

ఇంతకుముందెన్నడూ చూడని విధంగా సన్నివేశాలుంటాయి. డెఫినెట్‌గా ఈ సినిమా సక్సెస్‌ అయ్యి నిర్మాతగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. మా డిస్ట్రిబ్యూటర్స్‌ అందరూ ఎంతో కాన్ఫిడెంట్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 29న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం'' అన్నారు.

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ నాగేశ్వరరావు మాట్లాడుతూ - ''బాహుబలి'లాంటి చిత్రమిది. ప్రేక్షకులకు నచ్చేవిధంగా యాక్షన్‌ సీన్స్‌, యుద్ధ సన్నివేశాలు చాలా ధ్రిల్లింగ్‌గా ఉంటాయి. ప్రతి విజువల్‌ చాలా గ్రాండియర్‌గా ఉంటుంది. దీపావళి పండగకి ఇంతటి భారీ బడ్జెట్‌ చిత్రాన్ని రిలీజ్‌ చేయడం మాకెంతో ఆనందంగా వుంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం వుంది'' అన్నారు.

ఈ చిత్రానికి సహ నిర్మాత: జి. యుగంధర్‌రెడ్డి, నిర్మాత: జి.వంశీకృష్ణ వర్మ, దర్శకత్వం: ఫ్రాంకీ ఛాన్‌.

English summary
Here is Amazon Yodhulu Movie Telugu Dubbing Movie Teaser. Watch It and enjoy. Amazon Yodhulu Movie, Amazon Yodhulu Hollywood Dubbing Movie, Amazon Yodhulu Movie Teaser, Amazon Yodhulu Movie Trailer, Amazon Yodhulu Movie Release Date.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu