Amber Heard: ట్విటర్ అకౌంట్ డిలీట్ చేసిన హీరోయిన్!.. ఎలాన్ మస్కే కారణమా?

హాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అంబర్ హర్డ్ గురించి తెలిసిందే. ఇటీవల వివాదాస్పదంగా మారిన జంటల్లో అంబర్ హర్డ్, హాలీవుడ్ పాపులర్ హీరో (పైరెట్స్ ఆఫ్ ది కరెబియన్ ఫేమ్) జానీ డెప్ జోడి కూడా ఉంది. అంబర్ హర్డ్ పై జానీ డెప్ మాజీ భార్య. ఆమెపై పరువు నష్టం దావా వేసి గెలిచాడు జానీ డెప్. వీరి కేసు విచారణలో ఉన్నప్పుడు అనేక సంఘటనలు, మలుపులు చోటు చేసుకుంటూ ఆసక్తికరంగా సాగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ స్టార్ హీరోయిన్ ట్విటర్ అకౌంట్ కనిపించడం లేదు. అందుకు కారణం ఆమె మాజీ ప్రియుడు, అపర కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాళ్లోకి వెళితే..

44 బిలియన్ డాలర్లతో ట్విటర్ డీల్..

44 బిలియన్ డాలర్లతో ట్విటర్ డీల్..

అపర కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నిర్ణయాలు ఎప్పుడూ విచిత్రంగా ఉంటాయి. సాంకేతికంగా, ఆర్థికంగా అతను తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి షాకింగ్ కు గురి చేస్తాయి. ఎలాన్ మస్క్ ఇటీవల ట్విటర్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. సుమారు 44 బిలియన్ డాలర్లతో ఈ డీల్ ముగిసిందని సమాచారం. ఎలన్ మస్క్ ట్విటర్ ను అధికారికంగా సొంతం చేసుకున్న తర్వాత అనేక మంది సెలబ్రిటీలు ట్విటర్ కు గుడ్ బై చెబుతున్నారు. ఇలా ట్విటర్ ను ఎలాన్ సొంతం చేసుకున్నప్పటి నుంచి అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముందుగా మైక్రో బ్లాగింగ్ ద్వారా స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తానన్న ఎలాన్ మస్క్ అందరి అభిమానాన్ని సంపాందించాడు. కానీ ఆ తర్వాత అతను అనేక మార్పు చేశాడు.

ట్విటర్ ను వీడుతున్న సెలబ్రిటీలు..

ట్విటర్ ను వీడుతున్న సెలబ్రిటీలు..


ట్విటర్ ను సొంతం చేసుకున్నాక ఎలాన్ మస్క్ అనేక నిబంధనలు తీసుకొచ్చాడు. ఇందులో బ్లూ టిక్ కోసం, వెరిఫికేషన్ కోసమని నెలకు రూ. 8 డాలర్లు చెల్లించాల్సిందిగా తెలిపాడు. అలాగే ఆయన వచ్చినప్పటి నుంచి ప్రధాన మార్పుల పేరుతో సంస్థలోని కీలక ఉద్యోగులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ను సాగనంపి టెస్లా ఉద్యోగులను తీసుకుంటున్నాడు. దీంతో అనేక మంది సెలబ్రిటీలు ట్విటర్ ను వీడుతున్నారు. వీరిలో టోనీ బ్రాక్స్ టన్, షోండా రిమెస్, వ్రెస్లర్ మిక్ ఫోలేయ్ తో పాటు తదితరులు ఉన్నారు. తాజాగా వీరి బాటలేనే ఎలాన్ మస్క్ మాజీ ప్రేయసి, స్టార్ హీరోయిన్ అంబర్ హర్డ్ ట్విటర్ ను వీడినట్లు తెలుస్తోంది. అయితే ఆమెనే ట్విటర్ అకౌంట్ డిలీట్ చేసిందా.. లేక ట్విటర్ సంస్థే ఆమె ఖాతాను తొలగించిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఒక వేళ ఆమెనె డిలీట్ చేస్తే అందుకు కారణం ఎలాన్ మస్క్, జానీ డెప్ అభిమానులు అయింటారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. అలాగే అంబర్ హర్డ్ కూడా స్పందించలేదు.

ఈ అకౌంట్ కనిపించడంలేదు..

అంబర్ హర్డ్ ట్విటర్ అకౌంట్ కనిపించడం లేదని ముందుగా ఓ యూట్యూబర్ మాథ్యూ లెవిస్ గుర్తించాడు. ఈ విషయాన్ని 'ది అంబ్రెల్లా గాయ్' పేరుతో ఉన్న అతని ట్విటర్ అకౌంట్ లో అంబర్ హర్డ్ ట్విటర్ ఖాతాకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేశాడు. ఈ స్క్రీన్ షాట్ లో 'ఈ అకౌంట్ కనిపించడంలేదు' అని ఉండగా.. 'అంబర్ హర్డ్ తన ట్విటర్ అకౌంట్ ను డిలీట్ చేసింది' అని క్యాప్షన్ ఇచ్చాడు మాథ్యూ. కాగా జానీ డెప్ తో విడాకుల తర్వాత ఎలాన్ మస్క్ తో రిలేషన్ కొనసాగించింది అంబర్ హర్డ్. 2016 నుంచి 2018 వరకు వీరి బంధం నడించింది. ఆ తర్వాత అంబర్ హర్డ్, ఎలాన్ మస్క్ విడిపోయారు. ఇక ఇటీవల పరువు నష్టం దావా కింద జానీ డెప్ కు అంబర్ హర్డ్ 10.35 మిలియన్ డాలర్లు చెల్లించాల్సిందిగా కోర్టు తీర్పునిచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X