»   » షాకింగ్: వ్యభిచారం స్కాంలో ఆ నటి పేరు

షాకింగ్: వ్యభిచారం స్కాంలో ఆ నటి పేరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: అమెరికన్ మోడల్, నటి అంబర్ రోజ్ వ్యభిచారం స్కాంలో ఇరుక్కుంది. ఆమె వీడియో, ఫోటోలను ఎరగా ఉపయోగించి ఇంటర్నెట్ ఆధారంగా ఓ ముఠా మహిళలను వ్యబిచార కూపంలోకి లాగుతున్నట్లు తేలింది. అమెరికా పోలీసులు వ్యభిచార ముఠాపై ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పలువురు మోడల్స్ కూడా ఈ స్కాంలో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే అంబర్ రోజ్ షాకైంది. amberrosemuva@gmail.com పేరుతో ఏదైనా మెయిల్స్ వస్తే నమ్మొద్దని ఆమె తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాను ఎవరినీ వ్యభిచారం వైపు పురిగొల్పడం లేదని తెలిపింది.

Amber Rose

అంబర్ రోజ్ గురించిన వివరాల్లోకి వెళితే..
అంబర్ రోజ్...అమెరికాకు చెందిన హిప్ హాప్ ఆర్టిస్ట్ మరియు మోడల్, హాలీవుడ్ నటి. ఫ్యాషన్ డిజైనింగులో కూడా ఆమెకు ప్రావీణ్యం ఉంది. సాధారణంగా హీరోయిన్లు, మోడల్స్ అంతా అందమైన హెయిర్ స్టైల్ తో కనిపిస్తుంటారు. అయితే అంబర్ రోజ్ మాత్రం బోడిగుండుతోనే సెక్సీ నెస్‌ను ప్రదర్శిస్తూ వస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 15 ఏళ్ల వయసు నుండే అంబర్ రోస్ హాట్ అండ్ సెక్సీగా హిప్ హాప్ ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టింది. అంబర్ రోజ్ ను అభిమానులు శృంగార దేవతగా అభివర్ణిస్తుంటారు. ఆమె ప్రదర్శనలు తమకు శృంగార ఉత్ప్రేరకంగా ఉంటాయని పొగడ్తలు గుప్పిస్తుంటారు.

English summary
Amber Rose's likeness and name have been used to allegedly lure women into prostitution.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu