Don't Miss!
- News గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హీరోయిన్ నగ్న ఫొటోలు, వీడియోలు హ్యాక్.. నెట్లో పెడుతామని బ్లాక్ మెయిల్
సాంకేతిక ప్రపంచంలో సినీ తారల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను హ్యాక్ చేసి బెదిరింపులకు పాల్పడటం చాలా సాధారణంగా మారింది. అలాంటి వ్యవహారమే హాలీవుడ్ నటి బెల్లా థ్రోన్‌కు ఎదురైంది. కొందరు ఆమె నగ్న ఫొటోలు, వీడియోలను హ్యాక్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే హ్యాకర్ల బెదిరింపులకు లొంగకుండా తాను ఓ సంచలనమైన నిర్ణయం తీసుకొని వారికి షాకిచ్చింది. ఇంతకు బెల్లా థోర్న్ ఎలా బుద్ది చెప్పిందంటే...
నా అకౌంట్లు హ్యాక్
జూన్ 15 వ తేదీన నా సోషల్ మీడియా అకౌంట్లను కొందరు అగంతకులు హ్యాక్ చేశారు. ఆ తర్వాత 24 గంటలపాటు బెదిరింపులకు పాల్పడ్డారు. నగ్నంగా ఉన్న ఫొటోలను ఇంటర్నెట్, సోషల్ మీడియాలోకి లీక్ చేస్తామని వేధించారు. నా ఒక్క ఫొటోలనే సేకరించారని అనుకొన్నాను. కానీ అగంతకులు మరికొందరి సెలబ్రిటీల ఫొటోలను కూడా హ్యాక్ చేశారు. అలా నన్ను, ఇతరులను బెదిరిస్తూ నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూశారు అని బెల్లా థ్రోన్ చెప్పారు.
నా సహనాన్ని పరీక్షించారు
నా వక్షస్థలానికి సంబంధించిన ఫొటోలను నాకు షేర్ చేశాడు. దాంతో నాకు ఏడుపు ముంచుకొచ్చింది. అంతేకాకుండా నా సహనాన్ని పరీక్షించారు. అందుకే నేను డేరింగ్‌గా ఓ నిర్ణయం తీసుకోవాలనుకొన్నాను. అంతేకాకుండా వాళ్లకు ఊహించని షాక్ ఇవ్వాలని అనుకొన్నాను. పోలీసులు మీ ఇంటికి వస్తారు. వాళ్లు మీ అంతు చూస్తారని బెదిరిస్తూ ఫొటోలను బయటపెట్టాను అని బెల్లా థ్రోన్ చెప్పారు.
నా ఫొటోలు నేను బయటపెట్టాను
నా ఫోటోలు, వీడియోలు బయటపెడుతానని చేసిన బెదిరింపులకు నేను విసిగిపోయాను. దాంతో నా నగ్న ఫొటోలను, వీడియోలను నేను బయటపెట్టాలని నిర్ణయించుకొన్నాను. అలా చేస్తే నన్ను బ్లాక్ మెయిల్, బెదిరింపులకు వారికి అవకాశం ఉండదు. మరోసారి వాళ్లు నా జోలికి రాకుండా బుద్ది చెప్పాలని, ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోవాలని డిసైడ్ అయ్యాను. వాళ్లు చేసే పని నేనే చేస్తే నా జీవితం మరొకరి నియంత్రణలో ఉండదని తెలుసుకొన్నాను. దాంతో నా ఫొటోలు నెట్లో పోస్టు చేశాను అని బెల్లా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
అగంతకులపై జాలి వేసింది
నేను ఫొటోలు బయటపెట్టిన తర్వాత అగంతకులు టీనేజర్లని తెలుసుకొన్నాను. దాంతో వారిపై కొంత జాలి వేసింది. ఇంకా జీవితమంటే ఏమిటో తెలియని వాళ్లు పిల్ల చేష్టలకు పాల్పడ్డారని అనుకొన్నాను. వారిపై ఫిర్యాదు చేస్తే జీవితం నాశనం అవుతుందని భావించి వారిని క్షమించాలని అనుకొన్నాను. ఎదుటి వ్యక్తి చెడు కొణాన్ని చూపే బదులు మంచిని చూపించాలని అనుకొంటాను. అందుకే వారిని క్షమించాను. ఈ సంఘటనను నేను రాసే పుస్తకంలో పొందుపరుస్తాను అని బెల్లా థ్రోన్ చెప్పింది.