ఫ్లాట్‌లో శవమై తేలిన నటి.. 200కు పైగా శృంగార చిత్రాలతో రికార్డ్ బ్రేక్
అమెరికన్ నటి, ప్రఖ్యాత శృంగార తార కైలీ పేజీ మృతి చెందారు. ఆమె వయసు 28 సంవత్సరాలు. లాస్ ఏంజిల్స్‌లోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో శవమై తేలారు. ఆమె మరణంతో శృంగార ప్రపంచం, అభిమానులు షాక్ అయ్యారు. కైలీ మృతిని లాస్ ఏంజిల్స్ మెడికల్ ఎగ్జామినర్ ధృవీకరించారు. చట్టపరంగా ఆమె పేరు కైల్ పైలాంట్ అని తెలిపారు. కైలీ పేజ్ మరణానికి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. అమెరికన్ మీడియా కథనాలను బట్టి కైలీ జూన్ 25న ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కైలీ పేజ్ ప్రస్థానం
2016లో కైలీ పేజ్.. అడల్ట్ ఫిల్మ్ స్టార్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. బ్రేజర్స్, విక్సెన్ మీడియా గ్రూప్, నాటీ అమెరికా వంటి అగ్ర నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేస్తూ స్టార్‌డమ్ సంపాదించారు. కేవలం 9 ఏళ్ల కాలంలోనే 200కు పైగా శృంగార చిత్రాలు, సన్నివేశాలలో కనిపించి తిరుగులేని రికార్డ్ నెలకొల్పారు కైలీ పేజ్. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా 2017లో వచ్చిన హాట్ గర్ల్స్ వాంటెడ్: టర్డ్న్ ఆన్ అనే డాక్యుమెంటరీ ఆమెకు పేరు తీసుకొచ్చింది. ఈ డాక్యు సిరీస్‌లో భాగంగా అడల్ట్ ఇండస్ట్రీలోని సంగతులు.. తన కెరీర్‌లో ఎదురైన అనుభవాలు, సమస్యలు, సవాళ్లు గురించి బోల్డ్ కామెంట్స్ చేశారు కైలీ.

కైలీ నివాసంలో మాదక ద్రవ్యాలు
సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ సాగుతున్న వేళ ఆమె అకాల మరణం అభిమానులను షాక్‌కు గురిచేసింది. అయితే డ్రగ్స్ అలవాటే కైలీ ప్రాణాలు బలి తీసుకుందని అనుమానిస్తున్నారు. పరిమితికి మించి డ్రగ్స్ తీసుకోవడం వల్లే కైలీ మరణించిందని భావిస్తున్నారు. కైలీ మృతదేహం లభించిన ఫ్లాట్‌లో పోలీసులు, క్లూస్ టీమ్ సాక్ష్యాధారాల కోసం అణువణువునా గాలించారు. ఈ క్రమంలో డ్రగ్స్ సంబంధిత వస్తువులు ఆమె నివాసంలో కనిపించడంతో పోలీసులు అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఫెంటానిల్, మాదక ద్రవ్యాలు తీసుకోవడానికి ఉపయోగించే పరికరాలు పోలీసుల తనిఖీలలో దొరికినట్లుగా టీఎంజెడ్ వార్తా సంస్థ నివేదించింది. క్యాన్సర్ రోగులలో నొప్పిని తగ్గించడానికి ఉపయోగించే సింథటిక్ ఓపియాయిడ్ అయిన ఫెంటానిల్, మార్ఫిన్ కంటే 50 నుంచి 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైనదని నిపుణులు అంటున్నారు.
హత్యా? ఆత్మహత్యా?
ఇదే సమయంలో కొందరు వ్యక్తులతో కైలీ పేజ్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు దొరకడంతో ప్రేమ వ్యవహారం ఏమైనా ఆమె మరణానికి కారణమా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కైలీ పేజ్ మరణవార్త తెలుసుకున్న ఆమె అభిమానులు, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. అడల్ట్ ఇండస్ట్రీకి చెందిన కెనడియన్ కంపెనీ బ్రేజర్స్ సైతం కైలీ మరణవార్తతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కైలీ చిరునవ్వు ఎప్పటికీ గుర్తుండిపోతుందని.. ఈ క్లిష్ట సమయంలో కైలీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ఒక ప్రకటనలో సంతాపాన్ని తెలియజేసింది. కైలీ మృతదేహాన్ని కాలిఫోర్నియా నుంచి మిడ్‌వెస్ట్‌కు తరలించేందుకు ఆమె కుటుంబం ప్రయత్నాలు ప్రారంభించింది.
అంత్యక్రియల కోసం విరాళాలు
మరోవైపు.. కైలీ కుటుంబానికి అండగా నిలిచేందుకు, అంత్యక్రియలకు ఖర్చుల నిమిత్తం ఆమె పేరుతో గో ఫండ్ మీ ద్వారా విరాళాల సేకరణ ప్రారంభించారు. వారు ఇప్పుడు బిల్లులు, ఇతర ఖర్చుల గురించి ఆలోచించాల్సిన పనిలేదని గో ఫండ్ మీ పేజిలో రాసుకొచ్చారు.


Click it and Unblock the Notifications











