హాలీవుడ్ నటికి లైంగిక వేధింపులు.. దారుణంగా నోరు మూయించిన వైనం!
ఏ ఇండస్ట్రీలోనైనా మహిళలకు సమస్యలు ఉండటం ఈరోజుల్లో సర్వసాధారణమైంది. ఒకప్పుడు తమ సమస్యలను చెప్పేందుకు కూడా మహిళా ఉద్యోగులు ఎంతగానో ఇబ్బంది పడేవారు. తర్వాత వచ్చే భయంకర పరిస్థితులు, తలనొప్పులకు తలొగ్గి నోరు మూసుకుని ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ఇఫ్పుడు పరిస్థితులు మారాయి. ఏ ఇండస్ట్రీలోనైనా మహిళలు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకుంటున్న ఘటనలు కూడా చూస్తున్నాం. లేడీస్ ను చైతన్యవంతులుగా చేసేందుకు సొసైటీలో పలు అవెర్ నెస్ ప్రొగ్రామ్స్ కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
అయితే.. అన్నీ ఇండస్ట్రీల కంటే సినిమా ఇండస్ట్రీలో మహిళా నటీనటులకు కాస్తా ఇబ్బందులు ఎక్కువనే చెప్పాలి. తమ లక్ష్యాలను చేరుకునే మార్గం కొన్ని చోట్ల తమ ప్రమేయం లేకుండానే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ వంటివి జరుగుతున్నాయంటూ ఆ మధ్యలో వరుస పెట్టిన కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా 'మీటూ' యుద్ధమే జరిగి ప్రపంచ సినిమా వరల్డ్ లోనే పెద్ద చర్చ మొదలైన సంగతి అందరికీ విధితమే. మన తెలుగు నటీనటులు కూడా క్యాస్టింగ్ కౌచ్ పై తమ అభిప్రాయాలను కూడా వెల్లడించిన విషయం తెలిసిందే.

కాగా.. తాజాగా హాలీవుడ్ లోనూ లైంగిక వేధింపులు ఉన్నాయని తెలిపే వార్త ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ప్రముఖ అమెరికన్ నటి ఒలివియా మున్ రీసెంట్ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై స్పందించారు. హాలీవుడ్‌లో కూడా లైంగిక వేధింపుల సంఘటనలు సాధారణమని చెప్పే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా... కొన్నిసార్లు బాధితులను ఆయా హాలీవుడ్ స్టూడియోలు తమ ఇమేజ్‌ను కాపాడుకోవడానికి NDAలపైనా సంతకం చేయిస్తారని తెలియజేశారు.
ఇక తాజాగా అలాంటి ఒక సంఘటన గురించి ఆమె లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. హాలీవుడ్ సినిమా సెట్స్‌లో ఒలివియాకు జరిగిన బాధాకరమైన ఘటన గురించి మాట్లాడవద్దని, అందుకు NDA పై సంతకం చేస్తే మిలియన్ల డాలర్ల పరిహారం ఇస్తాననే ఆఫర్ తన వద్దకు వచ్చిందని చెప్పింది. కానీ నటి మాత్రం ఆ మిలియన్ డాలర్ల ఆఫర్ ను తీసుకోవడానికి నిరాకరించినట్టు తెలిపింది. అయితే తనకు ఒక సినిమా సెట్‌లో తనకు వ్యక్తిగతంగా ఇలాంటి ఘటన జరిగిందని చెప్పుకొచ్చింది.

అప్పుడే సరిగ్గా మీటూ యుద్ధం ప్రారంభమైందని, ఆ సమయంలోనే తను నోరు మెదపకుంటే ఏడు అంకెల డాలర్ల సొమ్మును పరిహారంగా అందిస్తామనే ఆఫర్ వచ్చిందని తెలిపింది. కానీ అది ఏమాత్రం సబబు కాదని నిరాకరించి.. సినిమా సెట్ లో జరిగిన బాధాకరమైన ఘటనపై స్టూడియోలో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. దాని వెంటనే డబ్బుతో వచ్చి ఎన్డీఏపై సైన్ చేయించాలని చూశారని తెలిపింది. కానీ ఒలియా ఏమాత్రం తలొగ్గకుండా ఎదురించానని చెప్పింది. ప్రస్తుతం ఒలివియా మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె 'ఎక్స్-మెన్', 'ది ప్రిడేటర్' వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం అమెరికన్ టీవీ సీరియల్స్ లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











