For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Oprah Winfreyఫై ధ్వజమెత్తిన టాప్ హీరోయిన్.. కామ పిశాచితో ముద్దులా? అంటూ ట్వీట్

  |

  లైంగిక వేధింపుల ఆరోపణలు, మానభంగం కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న హాలీవుడ్ నిర్మాత హర్వే వెయిన్‌స్టెయిన్‌ను ప్రముఖ టాక్ షో హోస్ట్ ఓప్రా విన్‌ఫ్రే ముద్దుపెట్టుకోవడంపై అమెరికన్ నటి రోస్ మెక్‌గోవాన్ భగ్గుమన్నది. ట్విట్టర్‌‌లో వారిద్దరి ఫోటోను షేర్ చేసి తీవ్రమైన పదజాలంతో దాడి చేసింది. ఓప్రా విన్‌ఫ్రే, హర్వే అక్రమ బంధానికి అది తార్కాణం అని విమర్శించింది. ఆ ఫోటోలో హార్వే వెయిన్‌స్టెయిన్‌ను ఓప్రా విన్‌ఫ్రే ముద్దు పెట్టుకొంటూ అతిసన్నిహితంగా ఉంది. ఇలా ద్వంద ప్రమాణాలను పాటించే ఓప్రా ఓ ఊసరవెల్లి అంటూ కామెంట్ చేసింది. తన టాక్ షోలో ఓప్రా సభ్య సమాజానికి నీతులు చెబతుంది. కానీ తెర వెనుక చేసేవన్నీ ఇలాంటి పనులే అంటూ ఘాటుగా స్పందించింది. హార్వేతో ముద్దులు ఓప్రా విన్ ఫ్రే నిజస్వరూపానికి సాక్ష్యం అంటూ ధ్వజమెత్తింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఓప్రా ఎంతకైనా దిగజారుతుంది వ్యాఖ్యానిచింది.

  రోస్ మెక్‌గోవాన్ ట్వీట్ చేసి.. ఓప్రా విన్‌ఫ్రే వికృత రూపాన్ని మీ ముందు పెట్టడం చాలా గర్వంగా అనిపిస్తున్నది. ఆమె నిజస్వరూపమేంటో చూపించాలన్నదే నా ప్రయత్నం. అందరూ అనుకొన్నట్టు ఆమె మంచిది కాదు మేకవన్నే పులి కామెంట్ చేసింది. రస్సెల్ సిమ్మన్స్ జీవితాన్ని నాశనం చేసిన హర్వె వెయిన్‌స్టెయిన్‌తో ఆమె జతకట్టడం దారుణం అని తన ట్వీట్‌లో పేర్కొన్నది.

  American actress Rose McGowan Serious on Oprah Winfrey kissing Harvey Weinstein

  హార్వే వెయిన్‌స్టెయిన్ విషయానికి వస్తే 2017లో ప్రారంభమైన మీటూ ఉద్యమంలో ఆయన చేసిన వికృత చేష్టలు బయటకు వచ్చాయి. పలువురు మహిళలను దారుణంగా రేప్ చేసి..దాడులకు పాల్పడినట్టు రుజువు అయింది. కోర్టులో విచారణ తర్వాత 2020లో హార్వేకు 23 సంవత్సరాల జైలుశిక్షను న్యాయస్థానం విధించింది.

  ఇక ఓప్రా విన్ ఫ్రే విషయానికి వస్తే.. మీటూ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో రస్సెస్ సిమన్స్ రూపొందించిన డాక్యుమెంటరీకి ఎగ్గిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. హార్వేను రక్షించడానికే అప్పుడు అలా నిర్ణయం తీసుకొన్నదని రోస్ ప్రస్తుతం బయటపెట్టింది.

  ఓప్రా విన్ ఫ్రే విషయానికి వస్తే.. ఆమె అసలు పేరు ఓప్రా గెయిల్ విన్ ఫ్రే. అమెరికాలో పాపులర్ టాక్ షో హోస్ట్, టెలివిజన్ నిర్మాత, నటి, రచయిత, సామాజిక సేవకురాలు. ది ఓప్రా విన్‌ఫ్రే షో ద్వారా ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులారిటీని సాధించారు. 20 శతాబ్దంలో అత్యంత సంపన్నురాలైన అమెరికన్ ఆఫ్రికన్‌గా రికార్డును సొంతం చేసుకొన్నారు. నల్లజాతీయుల్లోని బిలియనీర్లలో ఆమె ఒకరు. నటిగా ది కలర్ పర్పుల్, నేటివ్ సన్, లింకన్, ఏ వింకిల్ ఇన్ టైమ్, క్రో: ది లెజెండ్, ది హ్యాండ్‌మెయిడ్ టేల్ చిత్రాల్లో నటించింది.

  English summary
  Rose McGowan tweet on Oprah Winfrey over kissing Harvey Weinstein. I am glad more are seeing the ugly truth of Oprah. I wish she were real, but she isn’t. From being pals with Weinstein to abandoning & destroying Russell Simmon’s victims, she is about supporting a sick power structure for personal gain, she is as fake as they come. #lizard
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X