Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హాలీవుడ్ అందాల భామలతో ట్రంప్ సయ్యాటలు.. లైఫ్‌లో ఎవరికీ తెలియని మరో కోణం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ పర్యటనలో అందరి హృదయాలను ఆకట్టుకొంటున్నాడు. ఆహ్మాదాబాద్ చేరుకొన్న ట్రంప్ దంపతులు నేరు సబర్మతి ఆశ్రమాన్ని దర్శించుకొన్నారు. అనంతరం మోతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ పేరుతో ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో భారత ప్రధాని మోదీ, ట్రంప్ ఉద్వేగ భరితమైన ప్రసంగాలు చేశారు. ఈ క్రమంలో ట్రంప్ హిందీ సినీ పరిశ్రమ గురించి మాట్లాడటంతో ఆయనకు సినిమాల పట్ల ఉన్న అభిరుచిని తెలియజేసింది. ట్రంప్ పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించారనే విషయంలో మీడియాలో ప్రముఖంగా మారింది. వివరాల్లోకి వెళితే..
హాలీవుడ్ చిత్రాల్లో అతిథి పాత్రలతో
డొనాల్డ్ ట్రంప్ జీవన ప్రయాణం గురించి పరిశీలిస్తే.. ఆయన రాజకీయ వేత్తగా కొందరికి తెలియవచ్చు. అంతేకాకుండా స్పేస్ ఎక్స్ కంపెనీ అధినేతగా ఓ పారిశ్రామిక వేత్తగా కూడా ట్రంప్ పేరు పరిచయం ఉండొచ్చు. ఇక ఆయనలో తెలియని మరో కోణం ఏమిటంటే.. హాలీవుడ్ చిత్రాల్లో నటించిన అనుభవం కూడా ఉండటం గమనార్హం.
Recommended Video
విచిత్రంగా సినీ రంగంలోకి
డొనాల్డ్ ట్రంప్ సినీ రంగ ప్రవేశం విచిత్రంగా జరిగిందనే విషయం కొందరికే తెలుసు. అమెరికాలోని తన హోటల్లో షూటింగ్ జరుపుకోవడానికి ఓ చిత్ర యూనిట్ సంప్రదిస్తే.. తనకు ఆ సినిమాలో ఓ పాత్రను కల్పించి ఇస్తే తాను హోటల్లో షూటింగ్ చేసుకోవడానికి అనుమతిస్తానని కండీషన్ పెట్టారట. దాంతో ఆయనకు ఓ పాత్రను క్రియేట్ చేసి అందులో నటింపజేయడంతో ఆయన సినీ రంగ ప్రవేశం జరిగింది.
ట్రంప్ నటించిన చిత్రాలు
అలా ప్రారంభమైన డొనాల్డ్ ట్రంప్ సినీ రంగ ప్రవేశం.. హోమ్ అలోన్ 2, లాస్ట్ ఇన్ న్యూయార్క్ చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించేలా చేసింది. టూ వీక్స్ నోటీస్ అనే చిత్రంలో అందాల తార సాండ్రా బుల్లోక్తో కలిసి నటించే అవకాశాన్ని చేజిక్కించుకొన్నారు. అలాగే బెన్ స్టిల్లర్, ఓవెన్ విల్సన్‌తో కలిసి జూలండర్ చిత్రంలోనూ.. కిడ్డీ ఫ్లిక్ రూపొందించిన ది లిటిల్ రాస్కెల్స్ చిత్రంలో నటించారు.
బుల్లితెరపై కూడా ట్రంప్
ఇక వెండితెర మీదనే కాకుండా ట్రంప్ నటనా ప్రయాణం బుల్లితెర వరకు కూడా సాగింది. పలు టెలివిజన్ షోలలో కూడా నటించి మెప్పించారు. సెక్స్ అండ్ ది సిటీ అనే టెలివిజన్ కార్యక్రమంలో ట్రంప్ కీలక పాత్రను పోషించారు.