twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాలీవుడ్ అందాల భామలతో ట్రంప్ సయ్యాటలు.. లైఫ్‌లో ఎవరికీ తెలియని మరో కోణం

    |

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ పర్యటనలో అందరి హృదయాలను ఆకట్టుకొంటున్నాడు. ఆహ్మాదాబాద్‌ చేరుకొన్న ట్రంప్ దంపతులు నేరు సబర్మతి ఆశ్రమాన్ని దర్శించుకొన్నారు. అనంతరం మోతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ పేరుతో ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో భారత ప్రధాని మోదీ, ట్రంప్ ఉద్వేగ భరితమైన ప్రసంగాలు చేశారు. ఈ క్రమంలో ట్రంప్ హిందీ సినీ పరిశ్రమ గురించి మాట్లాడటంతో ఆయనకు సినిమాల పట్ల ఉన్న అభిరుచిని తెలియజేసింది. ట్రంప్ పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించారనే విషయంలో మీడియాలో ప్రముఖంగా మారింది. వివరాల్లోకి వెళితే..

    హాలీవుడ్ చిత్రాల్లో అతిథి పాత్రలతో

    హాలీవుడ్ చిత్రాల్లో అతిథి పాత్రలతో

    డొనాల్డ్ ట్రంప్ జీవన ప్రయాణం గురించి పరిశీలిస్తే.. ఆయన రాజకీయ వేత్తగా కొందరికి తెలియవచ్చు. అంతేకాకుండా స్పేస్ ఎక్స్ కంపెనీ అధినేతగా ఓ పారిశ్రామిక వేత్తగా కూడా ట్రంప్ పేరు పరిచయం ఉండొచ్చు. ఇక ఆయనలో తెలియని మరో కోణం ఏమిటంటే.. హాలీవుడ్ చిత్రాల్లో నటించిన అనుభవం కూడా ఉండటం గమనార్హం.

    Recommended Video

    If Sunny Leone Stand Next To Trump 10 Million People Welcome Him | Filmibeat Telugu
    విచిత్రంగా సినీ రంగంలోకి

    విచిత్రంగా సినీ రంగంలోకి

    డొనాల్డ్ ట్రంప్ సినీ రంగ ప్రవేశం విచిత్రంగా జరిగిందనే విషయం కొందరికే తెలుసు. అమెరికాలోని తన హోటల్‌లో షూటింగ్ జరుపుకోవడానికి ఓ చిత్ర యూనిట్ సంప్రదిస్తే.. తనకు ఆ సినిమాలో ఓ పాత్రను కల్పించి ఇస్తే తాను హోటల్‌లో షూటింగ్ చేసుకోవడానికి అనుమతిస్తానని కండీషన్ పెట్టారట. దాంతో ఆయనకు ఓ పాత్రను క్రియేట్ చేసి అందులో నటింపజేయడంతో ఆయన సినీ రంగ ప్రవేశం జరిగింది.

    ట్రంప్ నటించిన చిత్రాలు

    ట్రంప్ నటించిన చిత్రాలు

    అలా ప్రారంభమైన డొనాల్డ్ ట్రంప్ సినీ రంగ ప్రవేశం.. హోమ్ అలోన్ 2, లాస్ట్ ఇన్ న్యూయార్క్ చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించేలా చేసింది. టూ వీక్స్ నోటీస్ అనే చిత్రంలో అందాల తార సాండ్రా బుల్లోక్‌తో కలిసి నటించే అవకాశాన్ని చేజిక్కించుకొన్నారు. అలాగే బెన్ స్టిల్లర్, ఓవెన్ విల్సన్‌తో కలిసి జూలండర్ చిత్రంలోనూ.. కిడ్డీ ఫ్లిక్ రూపొందించిన ది లిటిల్ రాస్కెల్స్ చిత్రంలో నటించారు.

    బుల్లితెరపై కూడా ట్రంప్

    బుల్లితెరపై కూడా ట్రంప్

    ఇక వెండితెర మీదనే కాకుండా ట్రంప్ నటనా ప్రయాణం బుల్లితెర వరకు కూడా సాగింది. పలు టెలివిజన్ షోలలో కూడా నటించి మెప్పించారు. సెక్స్ అండ్ ది సిటీ అనే టెలివిజన్ కార్యక్రమంలో ట్రంప్ కీలక పాత్రను పోషించారు.

    English summary
    American President Donald Trump cameo in Hollywood movies and American Television shows. Trump featured in a cameo in the hit film Home Alone 2: Lost In New York.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X