»   »  ఒబామాతో శృంగారంలో పాల్గొనాలని లేడీ సింగర్ ఆరాటం

ఒబామాతో శృంగారంలో పాల్గొనాలని లేడీ సింగర్ ఆరాటం

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూయార్క్: అమెరికన్ రాప్ సింగర్ అజెలియా బాంక్స్ ఇటీవల బిల్ బోర్డ్ మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో సెన్సేషన్ కామెంట్స్ చేసింది. అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామాపై తనకున్న కోరికను బయట పెట్టింది. ఒబామాతో శృంగారంలో పాల్గొనాలని ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఒబామా చాలా అందంగా ఉంటాడని చెప్పుకొచ్చిందని ఈ 23 ఏళ్ల భామ. గాడిద లాంటి పెద్ద తెలుపురంగు పళ్లు, ఆయన తలకు వేలాడుతున్నట్లు ఉండే డిప్ప చెవులు అంటే నాకు చాలా ఇష్టం. ఓరి దేవుడా....ఇలాంటి అందగాడితో శృంగారంలో పాల్గొనే అవకాశం కల్పించు అని వ్యాఖ్యానించింది.

American singer's desire to sleep with Obama a joke

అజెలియా బ్యాంక్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు అమెరికాలో హాట్ టాపిక్ అయ్యాయి. కొందరైతే ఆమె వ్యాఖ్యలపై విమర్శలు సైతం ఎక్కు పెట్టారు. ఈ విషయమై సోషల్ మీడియాలో తనపై ఎదురు దాడి చేసే వారు పెరిగి పోవడంతో అజెలియా బ్యాంక్ వెనక్కు తగ్గింది. ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చింది.

‘నేను కేవలం జోక్ చేయడానికి అలాంటి వ్యాఖ్యలు చేసాను. అంతకు మించి మరే ఉద్దేశ్యం లేదు. ప్రెసిడెంటుగారిపై నాకు చాలా గౌరవం ఉంది' అంటూ అజెలియా బాంక్స్ ట్వీట్ చేసింది. అమ్ముడు వ్యవహారం గమనిస్తున్న వారంతా.....అలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడం ఎందుకు? ఇలా వివరణ ఇచ్చుకోవడం ఎందుకు అంటున్నారు.

English summary
American singer Azealia Banks has clarified that her desire to go between the sheets with the US President Barack Obama was a joke.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu