అమెరికాకు ఎంజలీనా జోలీ, ఇండియాకు ఐశ్వర్యారాయ్
onepoll.com అనే ఓ ప్రయివేట్ వెబ్సయిట్ నిర్వహించిన పోల్ లో అమెరికా ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తులు వున్న దేశంగా ఎంపికయింది. హాలీవుడ్ హాట్ తారలు జార్జ్ క్లోనే, ఏంజలీనా జోలీ, జెన్నిఫర్ అనిస్టాన్, బ్రాడ్ పిట్ లు అమెరికాను అందలం ఎక్కించడానికి దోహదం చేసాయి. ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్ నిలిచింది. హాలీవుడ్ కు మరో అందమయిన తార పెనిలోప్ క్రూజ్ ను అందించిన స్పెయిన్ మూడవ స్థానంలో నిలిచింది.
ఈ పోల్ లో భారత్ 8వ స్థానంలో నిలిచింది. ఇండియాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా తన అందంలో అభిమానులను ఏర్పరచుకున్న ఐశ్వర్యారాయ్ భారత్ కు ఈ స్థానం లభించేందుకు ముఖ్యకారణం అయింది. ఈమెతో పాటు కరీనా కపూర్, కత్రినా కైఫ్ లాంటి బాలీవుడ్ తారలు కూడా ఈ ఘనత సాధించేందుకు దోహదం చేసారు.
ఏంజలీనా జోలీ ఐశ్వర్యారాయ్ జెన్నిఫర్ అనిస్టాన్ బ్రాడ్ పిట్ జార్జ్ క్లోనే కరీనా కపూర్ కత్రినా కైఫ్ angelina jolie aishwarya rai jennifer aniston brad pitt kareena kapoor katrina kaif


Click it and Unblock the Notifications