బ్రాడ్ పిట్ చిత్రంలో అమితాబ్!
లాస్ ఏంజిల్స్: అమితాబ్ మరో హాలీవుడ్ సినిమాలో నటించనున్నారు. ఈమధ్యనే 'ది గ్రేట్ గ్యాట్స్‌బీ' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈసారి గ్రెగరీ డేవిడ్ రాబర్ట్ రాసిన నవల ఆధారంగా తీసే సినిమాలో నటించబోతున్నారు. ఆస్ట్రేలియా నుంచి పారిపోయి వచ్చి ముంబై చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన కదేర్‌భాయ్ పాత్రలో కనిపించనున్నారు. గార్త్ డేవిస్ దర్శకత్వం వహించే ఈ సినిమాను హాలీవుడ్ నటులు బ్రాడ్‌పిట్, జానీడెప్‌లు నిర్మిస్తారు.

గతంలోనూ హాలీవుడ్ దర్శకుడు బజ్ లహర్‌మన్ దర్శకత్వంలో రూపొందిన 3డీ చిత్రం 'ద గ్రేట్ గట్స్ బి' లో అమితాబ్ చేసారు. ఈ చిత్రంలో చీకటి సామ్రాజ్యాధినేతగా అమితాబ్ బచ్చన్ నటించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. టైటానిక్ ఫేమ్ లియోనార్డో డిక్రాపియో ప్రధాన పాత్రధారి. ఇతర పాత్రల్లో టాబీ మాగర్, కారీ ముల్లీగన్, ఇస్లా ఫిష్ నటించారు. ఇందులో మేయర్ వుల్ఫ్‌షిమ్ అనే పాత్రలో నటించనున్న అమితాబ్ బచ్చన్ ఈ చిత్రం కోసం ఎలాంటి పారితోషికాన్ని తీసుకోవడం లేదని తెలుస్తోంది.
అంతే కాకుండా అమితాబ్ బచ్చన్ ఈ చిత్రం గురించి తన బ్లాగులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.' గత ఏడాది దర్శకుడు బజ్ లహర్‌మన్ నన్ను కలిసి ఈ చిత్రానికి సంబంధించిన పేయింటింగ్స్ చూపించాడని, అవి నన్నెంతగానే ఆకర్షించాయని, అందుకే పాత్ర చిన్నదైనా ఈ హాలీవుడ్ చిత్రంలో నటించడానికి అంగీకరించానని తెలిపారు. అలాగే స్క్రిప్ట్ వినడానికి సిడ్నీ వెళ్లానని, అక్కడే నాపాత్రకు సంబంధించిన మేకప్ టెస్ట్‌ని దర్శకుడు బజ్ లహర్‌మన్ నిర్వహించాడని, తొలి సారి ఓ హాలీవుడ్ చిత్రంలో నటించడం మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు అమితాబ్ బచ్చన్.


Click it and Unblock the Notifications











