twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్లేబాయ్‌తో అమీ జాక్సన్ డేటింగ్.. ప్రియుడికి వేలకోట్ల ఆస్తి.. అర్థనగ్నంగా ప్రేమ జంట..

    By Rajababu
    |

    బ్రిటన్ నుంచి దిగుమతి అయిన అందాలభామ అమీ జాక్సన్ భారీ బడ్జెట్ చిత్రాలతో హడావిడి చేస్తున్నది. కెరీర్‌లో మంచి హిట్ లేకపోయినా క్రేజీ ప్రాజెక్టులతో భారతీయ సినిమా పరిశ్రమలో హల్‌చల్ చేస్తున్నది. ఎప్పడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమీజాక్సన్ తాజాగా ఓ ప్లేబోయ్‌తో డేటింగ్ చేస్తున్నట్టు చెప్పకనే చెప్పింది. హాట్‌హాట్‌గా ఉన్న వారిద్దరి ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

     ప్రియుడితో అతిసన్నిహితంగా

    ప్రియుడితో అతిసన్నిహితంగా

    అమీజాక్సన్ ఇటీవల తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఫొటోలతో ఆమె ప్రేమలో పడిందనే విషయం స్పష్టమవుతున్నది. తన ప్రియుడితో జోష్‌గా డేటింగ్ చేస్తున్నట్టు అనిపిస్తున్నది. అతిసన్నిహితంగా కలిసి ఉన్న వారిద్దరి ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

    సంపన్నుడితో డేటింగ్

    సంపన్నుడితో డేటింగ్

    అమీజాక్సన్‌తో డేటింగ్ చేస్తున్నది ఎవరో కాదు. మల్టీ మిలియనర్ ప్లేబాయ్ జార్జ్ పనాయిటూ. అతను అండ్రియాస్ పనయిటూ అనే బ్రిటన్ రియల్ ఎస్టేట్ కుమారుడు కావడం విశేషం. అండ్రియాస్ కుటుంబానికి విలాసవంతమైన హోటళ్లను నడిపే వ్యాపారం ఉంది. ది ఎబిలిటి గ్రూప్ అనే సంస్థకు జార్జ్ అధినేతగా వ్యవహరిస్తున్నారు. జార్జ్ తండ్రికి సుమారు 3600 కోట్ల ఆస్తి ఉంది.

    వారికి నేర చరిత్రం

    వారికి నేర చరిత్రం

    అండ్రియాస్ పనాయిటూకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో జార్జ్ ఒకరు కాగా, మరోకరు కోస్టాస్. వీరిద్దరూ ఇటీవల బ్రిటన్‌లో ఓ పోలీస్ అధికారితో స్ట్రీట్ ఫైట్‌కు దిగడం గమనార్హం. ఆ వ్యవహారంలో వీరిపై కేసు కూడా నమోదైంది. కోస్టాస్‌కు 15 నెలల జైలుశిక్ష పడింది.

    రంజుగా జార్జ్‌తో అఫైర్

    రంజుగా జార్జ్‌తో అఫైర్

    ఇలాంటి నేర చరిత్రతోపాటు సంపన్న నేపథ్యం ఉన్న జార్జ్‌తో అమీ జాక్సన్ డేటింగ్ రంజుగా సాగుతున్నది. వాలంటైన్స్ డే రోజున పెంపుడు కుక్కతో తన బాయ్‌ఫ్రెండ్‌ ఉన్న ఫోటోను షేర్ చేసింది. తన జీవితాన్ని క్రేజీగా మలిచినందుకు, తన లైఫ్‌కు అండగా నిలిచినందుకు చాలా థ్యాంక్స్ అని ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్ట్ కూడా పెట్టింది.

     2015 నుంచే అమీ డేటింగ్

    2015 నుంచే అమీ డేటింగ్

    2015లో జార్జ్‌తో అమీజాక్సన్ అఫైర్ ప్రారంభించింది. ఆ మధ్య వారిద్దరూ అంటీ ముట్టనట్టు ఉన్నారు. ఇటీవలే మళ్లీ డేటింగ్ వ్యవహారం చిగురించిందట. అప్పటి నుంచి వారిద్దరూ పలు దేశాల్లో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారట.

     ప్రతీక్ బబ్బర్‌తో అఫైర్

    ప్రతీక్ బబ్బర్‌తో అఫైర్

    బాలీవుడ్‌లో కూడా అమీ జాక్సన్‌కు అఫైర్ల చరిత్ర ఘనంగా ఉంది. గతంలో ఏక్ దీవానాలో సహనటుడు ప్రతీక్ బబ్బర్‌తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత వ్యక్తిగత విభేదాల కారణంగా బబ్బర్‌కు దూరమైంది.

     రోబో2 చిత్రంలో అమీ

    రోబో2 చిత్రంలో అమీ

    ప్రస్తుతం శంకర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన రోబో2 చిత్రంలో రజనీకాంత్‌తో జతకట్టింది. సూపర్ గర్ల్ అనే టీవీ సిరీస్‌లో ఓ కీలకపాత్రను పోషిస్తున్నది.

    English summary
    Amy Jackson latest posts indicate that she has found her man. She has been posting intimate pictures with a guy who goes by the name gp_abilitygroup (on Instagram). The special man in Amy's life is 'multi-millionaire playboy' George Panayiotou, son of British property developer Andreas Panayitou. The Panayitous own a chain of luxury hotels.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X