తల్లైన తర్వాత మరో నటుడితో హీరోయిన్ ఎఫైర్: నోట్లో నోరు పెట్టి.. ఇదేం పాడు పని!

సినీ రంగంలో ఉన్న వాళ్లకు లవ్ ట్రాకులు, డేటింగ్‌లు, బ్రేకప్‌లు, మ్యారేజ్‌లు సర్వసాధారణమైన విషయాలని చెప్పుకోవచ్చు. హాలీవుడ్‌లో ఇలాంటివి మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎఫైర్లతో హాట్ టాపిక్ అవుతోన్న నటీమణుల్లో ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్ ఒకరు. ఇండియాలో పలు చిత్రాల్లో నటించిన ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ.. తల్లైన తర్వాత కూడా మరో నటుడితో డేటింగ్ చేస్తోంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, కొన్ని దారుణమైన రొమాంటిక్ పిక్స్‌ను కూడా షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి!

ఇండియాలో అమీ పాపులర్

ఇండియాలో అమీ పాపులర్

ఫారెన్ చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న అమీ జాక్సన్ 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రం ద్వారా ఇండియాలోకి వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ 'ఎవడు' మూవీతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందించిన 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. దీంతో ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయింది.

డేటింగ్‌లో ప్రెగ్నెంట్.. బ్రేక్

డేటింగ్‌లో ప్రెగ్నెంట్.. బ్రేక్

ఇండియాలో వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న సమయంలోనే ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్.. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో లవ్ ట్రాక్ నడిపింది. ఆ సమయంలోనే ఆమె గర్భం దాల్చింది. అలా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే అతడితో నిశ్చితార్థం చేసుకుని పెళ్లి చేసుకోడానికి రెడీ అయింది. ఇక, అప్పటి నుంచి అమీ సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది.

తల్లైన తర్వాతనే విడిపోయి

తల్లైన తర్వాతనే విడిపోయి

జార్జ్‌ పనాయొటోతో లవ్‌లో ఉన్నప్పుడే ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్.. ఆ తర్వాత ఓ మగబిడ్డకు కూడా జన్మనిచ్చింది. అనంతరం వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా అమీ జాక్సన్.. తన ప్రియుడుకు బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుంచి బిడ్డతో కలిసి సమయాన్ని గడుపుతోంది. అలాగే, నటిగా కెరీర్‌ను కూడా కంటిన్యూ చేయడం లేదు.

ఇప్పుడా నటుడితో డేటింగ్

ఇప్పుడా నటుడితో డేటింగ్

పేరుకు హీరోయిన్ అయినా ఆ రకంగా కాకుండా లవ్ ట్రాకుల వల్లనే అమీ జాక్సన్ అంతర్జాతీయ స్థాయిలో హైలైట్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎడ్ వెస్ట్‌విక్ అనే విదేశీ నటుడితో డేటింగ్ చేస్తున్నట్లు ఓ వార్త ఆ మధ్య వైరల్ అయింది. దీనికి కారణం అమీ అతడితో కలిసి పలుమార్లు కెమెరాల కంటికి చిక్కడమే. అప్పటి నుంచి వీళ్లిద్దరి వ్యవహారం హాట్ టాపిక్ అవుతూనే ఉంది.

ఆ ఫొటోలు.. హింట్ ఇచ్చి

ఆ ఫొటోలు.. హింట్ ఇచ్చి

చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాలు చేసినా.. ఈ మధ్య ఖాళీగానే ఉంటోన్నా అమీ జాక్సన్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితమే అమీ జాక్సన్.. కొత్త బాయ్‌ఫ్రెండ్‌ ఎడ్ వెస్ట్‌విక్‌తో తీసుకున్న రొమాంటిక్ ఫొటోలను షేర్ చేసింది. దీంతో అతడితో లవ్‌లో ఉన్నట్లు హింట్ ఇచ్చింది. అప్పటి నుంచి వీళ్ల ట్రాక్‌పై క్లారిటీ వచ్చింది.

ప్రేమికుల రోజును హాట్‌గా

ప్రేమికుల రోజును హాట్‌గా

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోన్న అమీ జాక్సన్.. తన అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలతో పాటు అప్పుడప్పుడూ రొమాంటిక్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొత్త బాయ్‌ఫ్రెండ్ ఎడ్ వెస్ట్‌విక్‌ తీసుకున్న రొమాంటిక్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఇద్దరూ నాలుకలతో పెనవేసుకున్న పిక్ మరింతగా హైలైట్ అవుతోంది.

అధికారికంగా ప్రకటించేసి

అధికారికంగా ప్రకటించేసి

ప్రేమికుల రోజును పురస్కరించుకుని అమీ జాక్సన్.. తన కొత్త బాయ్‌ఫ్రెండ్ ఎడ్ వెస్ట్‌విక్‌‌తో తీసుకున్న ఎన్నో అపురూపమైన హాట్ ఫొటోలను షేర్ చేసింది. అంతేకాదు, 'హ్యాపీ వాలంటైన్స్ డే బేబీ. నీతో జీవితం ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. నీ వెల కట్టలేని ప్రేమకు ధన్యవాదాలు' అంటూ ఎడ్‌తో తన బంధాన్ని అమీ జాక్సన్ అధికారికంగానే ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X