Anaconda Release Date: తెరపైన భీభత్సానికి అనకొండ రెడీ.. మాస్ ఫ్యాన్ బేస్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
సినిమా ప్రేక్షకులకు 2025 క్రిస్మస్ పండుగ ప్రత్యేకమైన అనుభూతిని పంచే విధంగా మారబోతున్నది. అనకొండ సిరీస్‌ను అభిమానించే ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచే విధంగా డిసెంబర్ 25 రోజు ప్రత్యేకమైన రోజుగా మారబోతున్నది. అనకొండ చిత్రం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్దమైంది. అనకొండ ఫ్రాంచైజీలో ఆరో చిత్రంగా వస్తున్న మెటా రీబూట్ చిత్రంలో యాక్షన్ కామెడీకి పెద్ద పీట వేశారు. 1997 సంవత్సరంలో అనకొండ చిత్రాన్ని తొలిసారి టామ్ గార్మికాన్ అందించారు. ఈ చిత్రంలో పాల్ రాడ్, జాక్ బ్లాక్, స్టీవ్ జాన్, థాండివ్ న్యూటన్, డెనీలా మెల్చియార్, సెల్టాన్ మెల్లో తదితరుల ప్రధాన పాత్రల్లో నటించారు.
2025లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనకొండ సినిమా విషయానికి వస్తే.. దట్టమైన అమెజాన్ ఫారెస్ట్‌లో జాక్ బ్లాక్ పోషించిన డౌగ్, పాల్ రడ్ పోషించిన గ్రిఫ్ పాత్రల చుట్టే ప్రధానంగా కథ తిరుగుతుంది. 1997 సంవత్సరంలో తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన అనకొండ సినిమా షూటింగ్ నాటి అనుభూతులను, అనుభవాలను మరోసారి నెమరు వేసుకొనే అవకాశం కల్పించింది. యువకులుగా మేము ఉత్సాహంగా షూటింగ్‌లో పాల్గొన్న రోజులు మళ్లీ గుర్తుకు వస్తున్నాయని చిత్ర యూనిట్ తమ ఆనందాన్ని పంచుకొంటున్నారు. భయకంరమైన అతి పెద్ద అనకొండ చిత్రీకరణ సమయంలో ఆటవిడుపు అంశాలు చాలా మాకు ఇంకా గుర్తుకు వస్తున్నాయి. సర్వైవల్ బ్యాటిల్‌గా రూపొందడంలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడంలో చిత్ర యూనిట్ అందించిన సహకారం గొప్పది అని అన్నారు.

1997 లో సంచలన విజయం సాధించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ అనకొండ చిత్రాన్ని లూయిస్ లోసా రూపొందించారు. అనకొండ సిరీస్‌లో తొలి చిత్రంగా వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాను కల్ట్ క్లాసిక్‌గా మలిచి భారీ హిట్‌గా మార్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 ఇన్స్‌స్టాల్‌మెంట్స్ పూర్తయ్యాయి. 2004 సంవత్సరంలో అనకొండాస్: ది హంట్ ఫర్ బ్లడ్ ఆర్చిడ్, 2008 సంవత్సరంలో అనకొండ 3: ఆఫ్‌స్ప్రింగ్, 2009 సంవత్సరంలో అనకొండాస్: ట్రైల్ ఆఫ్ బ్లడ్, 2015 ఏడాదిలో లేక్ ప్లేసిడ్ Vs అనకొం చిత్రాలు ప్రేక్షకులకు మరుపురాని అనుభూతిని పంచాయి.
అనకొండ సిరీస్ అంటే.. నరమాంస భక్షక అనకొండలు, వాటి అంతమొందించే చర్యలు, వాటి నుంచి రక్షించుకొనే బతుకు పోరాటం ఈ సినిమాల్లో కనిపిస్తాయి. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మాస్ ఫాలోయింగ్ ఏర్పడిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇలాంటి ప్రత్యేకతలు, ఫ్యాన్ బేస్ ఉన్న అనకొండ చిత్రం మరోసారి డిసెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. సోని పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేస్తున్న అనకొండ సినిమా అందించే థ్రిల్లింగ్ స్టోరీ, ప్రాణాంతక జీవిపై వచ్చే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు రెడీగా అయ్యారా?


Click it and Unblock the Notifications











