అదొక అపద్దాల పుట్ట..!!
అమెరికా మోడలింగ్ రంగంలో ఓ వెలుగు వెలిగిన క్యాటీ ప్రైజ్ ప్రస్తుతం తన భర్తతో విడిపోయి, తన కొత్త బాయ్ ప్రెండ్ లో వుంటూ నిత్యం ఏదో ఓ వివాదాశ్పద వార్తతో లైమ్ లైట్ లో వుంటోంది. తాజా తన భర్త, ఆస్ట్రేలియా గాయకుడు పీటర్ ఆండ్రీ నుండీ చట్టబద్దంగా విడిపోయిన ఆయన గురించి వివాదాశ్పద వ్యాఖ్యలు చేసి తిరిగి మీడియాను తన వైపు తిప్పుకొంది. తన మాజీ భర్త పీటర్ ఆండ్రీ చాలా మంది అమ్మాయిలతో శారీరక సంబందాన్ని కొనసాగిస్తున్నాడని బాంబు పేల్చింది. దీనికి తోడు క్యాటీ తల్లి కూడా పీటర్ మీద విమర్శనాస్త్రాలు సంధించడంతో మౌనంగా వున్న పీటర్ విరుచుకుపడ్డాడు.
అసలు క్యాటీ ఓ అపద్దాల పుట్ట అని తన నుండీ విడిపోయాకా అందరి దగ్గరా తనని చెడ్డ చేసి తన మీద జాలి కలిగేలా చెయ్యడానికి ఇలాంటి విపరీత వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించాడు. ఇంతకు ముందు బాక్సర్ రెయిడ్ నుండీ విడిపోతుందనే వార్తలు వచ్చినప్పుడు రెయిడ్ ఓ క్రాస్ డ్రస్సర్ అనే విషయాన్ని బయటపెట్టి రాద్దాంతం చేసిందని, అయినా ఆమెకివన్నీ వెన్నతో పెట్టిన విధ్య అని విమర్శించాడు.


Click it and Unblock the Notifications











