twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విడాకులని సంబరంగా జరుపుకుంటున్న గాయకుడు

    By Kuladeep
    |

    ఒకప్పటి అమెరికా మోడల్ క్యాటీ ప్రైజ్ జోర్డాన్ తన వ్యక్తిగత విషయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూవుంటుంది. తాజాగా ఆమె భర్త ఆస్ట్రేలియా గాయకుడు పీటర్ ఆండ్రీ నుండీ విడుకులు తీసుకుంటోంది. ఈ విడాకులని పీటర్ ఆండ్రీ ఓ పెద్ద వేడుకలా జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. తన పిల్లలతో కలసి ఈ వేడుకని జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు స్వయంగా పీటర్ ఆండ్రీనే వెళ్లడించాడు. విడాకుల గురించి తాను బాధపడుతున్నట్టు క్యాటీ ప్రైజ్ ను బెదిరిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, నిజానికి తానెంతో ఆనందంగా వున్నానని పేర్కొన్నాడు.

    క్యాటీ ప్రైజ్ నుండీ తాను కొన్ని నెలల ముందే విడిపోయానని, తానిప్పుడెంతో సంతోషంగా వున్నానని చెప్పుకొచ్చాడు. కానీ క్యాటీ ప్రైజ్ మాత్రం వీటినేవీ పట్టించుకొనే స్థితిలో లేదు. తన కొత్త బాయ్ ఫ్రెండ్ బాక్సర్ అలెక్స్ రెయిడ్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తోంది. అంతే కాదు తాజాగా రెయిడ్ ను కూడా వదిలెయ్యబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చుతూ క్యాటీ, రెయిడ్ ఓ ట్రై సెక్సువల్ అనే విషయాన్ని బయటపెట్టింది. వీరిద్దరూ ఎన్ని రోజులు కలిసుంటారో చూద్దాం!!

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X