రూ 12.75 కొట్ల విలువైన బ్రా ధరించడం అదృష్టం
ఆస్ట్రేలియా సూపర్ మోడల్ మిరందాకెర్ న్యూయార్క్‌లో నిన్న జరిగిన 'విక్టోరియా సీక్రెట్ ప్యాషన్ షో'లో ఆమె ధరించిన బ్రా ధర తెలిస్తే అభిమానులు అవాక్కైపోతారు. ఇంతకీ మిరందా కెర్ ధరించిన బ్రా ఖరీదు ఎంతని అనుకుంటున్నారా.. అక్షరాలా రూ 12.75 కొట్లు.
మిరందా కెర్ అలా అందమైన ఆణిముత్యం లాంటి డ్రస్సు మీద నడుస్తూ వస్తుంటే అక్కడున్న చూపరులు తమచూపుని తిప్పుకొలేక పోయారంటే నమ్మండి. మిరందా కెర్ ధరించిన బ్రాలో 3,400 రత్నాలు, 142 క్యారెట్లు విలువ కలిగిన తెలుపు, పసుపు వజ్రాలు, ముత్యాలతో పాటు 18 క్యారెట్లు విలువ కలిగిన తెలుపు, పసుపు బంగరాన్ని బ్రాలో నిక్షిప్తం చేయడం జరిగింది.
ఈ బ్రా ధరించి ప్రదర్శించిన తర్వాత మిరందా కెర్ మాట్లాడుతూ ఇంతటి ఖరీదైన విలువ కలిగిన 'బ్రా'ని ధరించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నేను ధరించిన 'బ్రా' పై చేసిన ఆర్ట్ వర్క్ నిజంగా అధ్బుతం. నా ఒంటిపై కొన్ని మిలియన్లు విలువ కలిగిన బ్రాని ధరించానని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











