బ్రాడ్ పిట్ కు ఎంజలీనా గుడ్ బై??
ఇద్దరూ ఇద్దరే ఒకరేమో హాలీవుడ్ వెండితెరనేలుతున్న హాటు అందాల సుందరి ఏంజిలీనా జోలీ, మరొకరు తన మోడలింగ్ కెరీర్‌లో ఎంతో ఉన్నత శిఖాలను చేరుకొని ప్రపంచంలోనే టాప్ ఎర్నింగ్ మోడల్‌గా పేరు తెచ్చుకున్న స్టార్ మోడల్ జెన్నిఫర్ ఆనిస్టన్. వీరిద్దరూ ఓ విషయంలో గొడవపడుతున్నారు. వారిద్దరూ గొడవపడేది బాయ్‌ఫ్రెండ్ విషయంలో. అదే ఇప్పుడు హాలీవుడ్‌లో హాట్ న్యూస్. ఎప్పుడూ వివాదాల్లో ఉండే హాలీవుడ్ అందాల సుందరి ఏంజిలీనా జోలీ ఈ విషయంలోనే ఆనిస్టన్‌కు వార్నింగ్ కూడా ఇచ్చిందట. ఇటీవలి కాలంలో వీరిద్దరిమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. దీనికంతటికీ కారణం తన లేటెస్ట్ బాయ్‌ఫ్రెండ్ హాలీవుడ్ సూపర్‌స్టార్ బ్రాడ్‌పిట్‌తో ఆనిస్టన్ సన్నిహితంగా ఉంటోందని జోలీ ఆరోపణ. ఈ విషయంలో జోలీ ఆనిస్టన్‌కు చాలా ఘాటుగానే వార్నింగ్ ఇచ్చిందట.
బ్రాడ్‌పిట్‌కు అనిస్టన్ మెసేజెస్ ఇవ్వడం ఆపాలని లేదంటే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించిందిట. అంతేకాదు బ్రాడ్‌పిట్ మొబైల్ నుండి జోలీనే స్వయంగా వార్నింగ్ మెసేజ్ ఇస్తోందట. ప్రతి మెసేజ్ చివరిలో ఏ.జే. అనే అక్షరాలతో సైన్ చేసి మరీ మెసేజ్ పంపుతోందని బ్రిటన్‌కు చెందిన డెయిలీ మెయిల్ కో యుకే అనే వార్తా సంస్థ వీరిద్దరి మధ్య జరుగుతోన్న కోల్డు వార్‌ను బట్టబయలు చేసింది.
ఒకవేళ బ్రాడ్‌పిట్‌కు ఏంజిలీనా జోలీకి మధ్య వ్యవహారం చెడితే తన మాజీ భర్తను తిరిగి మళ్ళీ తన సొంతం చేసుకోవాలి ఆనిస్టన్ ఆశపడుతోంది. హాలీవుడ్ సుందరాంగులు డ్రస్‌లు మార్చుకున్నంత తేలికగా భర్తలను, బాయ్‌ఫ్రెండ్‌లను మార్చేస్తారన్నది జగమెరిగన సత్యం. అయితే విడిపోయిన భర్తమీద మళ్ళీ మనసుపడడం చాలా అరుదుగా జరుగుతుంది. 2000 సంవత్సరంలో బ్రాడ్‌పిట్‌ను పెళ్ళి చేసుకున్న జెన్నిఫర్ ఆనిస్టన్ 2005లో విడాకులు తీసుకుంది. అయితే ఆనిస్టన్‌తో తెగతెంపులు చేసుకున్న వెంటనే ఏంజిలీనా జోలీని తన పార్టనర్‌గా చేసుకున్నాడు పిట్.
ప్రియురాళ్ళను మార్చడంలో బ్రాడ్‌పిట్ కూడా వీరికి ఏమాత్రం తీసిపోడు. జెన్నిఫర్ ఆనిస్టన్‌ను వివాహం చేసుకోకముందు మరో హాలీవుడ్ నటి గ్వెనెత్ పాల్త్రోతో కొన్నేళ్లు డేటింగ్ కూడా చేశాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఏంజిలీనా జోలీతో జతకట్టడంతో వరల్డ్ మీడియాకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉన్నాడు. ఇదంతా బాగానే ఉన్నా పిట్ మాజీ భార్య ఆనిస్టన్ మళ్ళీ ఆయనపై మనసుపారేసు కోవడంతో అసలు చిక్కంతా వచ్చింది.
అనిస్టన్ మాటిమాటికి పిట్‌తో రాయబారాలు సాగిస్తుండడంతో జోలీకి ఒళ్ళుమండిపోతోదట. ఇప్పుడు వీరిద్దరి గొడవ మధ్యలో బ్రాడ్‌పిట్ నలిగిపోతున్నాడు. తరుచూ బాయ్ ఫ్రెండ్స్‌ను మార్చే అలవాటు ఉన్న ఏంజిలీనా జోలీ బ్రాడ్ పిట్‌తో మాత్రం గత అయిదేళ్ళుగా కలిసి ఉండడం విశేషం. ఇరువురు భామలు ఒకరి పై ఒకరు నిందారోపణలు చేసుకుంటుంటే బ్రాడ్‌పిట్ మాత్రం ఇద్దరిలో ఎవరు దక్కిన పర్వాలేదు అన్నట్లు వ్యవహరిస్తుండంతో జోలీ, పిట్‌కు టాటా చెప్పవచ్చునంటున్నాయి హాలీవుడ్ వర్గాలు. అదే జరిగితే తన మాజీ భర్తను మళ్ళీ తనసొంతం చేసుకోవాలని చూస్తోన్న జెన్నిఫర్ ఆనిస్టిన్‌కు పండగే.


Click it and Unblock the Notifications











