బ్రాడ్ పిట్ ను కాదన్న ఏంజలీనా జోలీ

By Kuladeep

హాలీవుడ్ హాట్ జంట ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ లు ఎంతో అన్యోన్యంగా వుంటున్నారు. ఇద్దరూ కలసి ముగ్గురు అనాధలను దత్తతకు తీసుకొని వారి ఆలనాపాసనా చూస్తున్నారు. ఈ ముగ్గురు కాక వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు. దీంతో ఆరుగురు పిల్లలను వీరు పెంచుతున్నారు. ఇటీవల ఎంజలీనా 'ది సాల్ట్' అనే సినిమాకోసం ఓ నెలరోజుల పాటు షూటింగ్ లో పాల్గొనడానికి వెళ్లగా బ్రాడ్ ఒక్కడే వారి అవసరాలు తీర్చుతూ చాలా సంతోషంగా గడిపేసాడుట...ఇలా ఎంతో అభిమానంగా వుంటున్న బ్రాడ్ మాటకు విరుద్ధంగా ఎంజలీనా ఓ పని చేస్తోందట.

అదేంటంటే ఆమె తాజాగా సిరియాకు చెందిన ఓ పాపను దత్తతకు తీసుకోవాలనుకొంటోందట. తనకు ఇంద్రధనస్సులో ఏడురంగులున్నట్టుగా ఏడుగురు పిల్లులు కావాలనే ఆమె కోరికను బ్రాడ్ కాదన్నాడట. ఇప్పుడున్న ఆరుగురు పిల్లలను బాగా చూసుకొంటే చాలని అతను అభిప్రాయపడ్డాడట. కానీ ఇది ఏంజలీనాకు మింగుడుపడలేదంట. అందుకే బ్రాడ్ సహకారం లేకపోయినా ఆ పాపను దత్తతకు తీసుకోవాలని భావించి, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకొంటోందట. ఈ వ్యవహారం ఇద్దరి మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తోందని హాలీవుడ్ జనాలు చెవులు కొరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X