8 ఏండ్ల పోరాటం.. ఎట్టకేలకు విడాకులు తీసుకున్న సెలబ్రెటీ జంట..
2024లో సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లో తుఫాన్ చెలరేగింది. సినీ కెరీర్ పరంగానే కాదు. వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఏడాదిలో ఎంతో మంది సెలబ్రెటీలు తమ ప్రేమ బంధానికి, వైవాహిక బంధానికి ఎండ్ కార్డ్ వేశారు. ఈ ఏడాది చివరి రోజు కూడా ఓ సెలబ్రెటీ జంట తమ పెళ్లి బంధాన్ని తెంచుకుంది. దాదాపు 8 ఏండ్లు వారి విడాకుల పోరాటానికి ముగింపు పడింది. ఇంతకీ ఆ జంట ఎవరు ?
ఆ జంట ఎవరో కాదు.. హాలీవుడ్ తారలు బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ. ఈ జంట సెప్టెంబరు 2016లో విడాకుల కోసం దాఖలు చేశారు. దాదాపు 8 ఏండ్లుగా కోర్టులో వీరి పోరాటం జరుగుతూనే ఉంది. ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్ విడాకుల కేసులో రోజురోజుకు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తరుచు ఒకరిపై ఒకరూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

తాజా హాలీవుడ్ తారలు బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీలు మరోసారి వార్తలో నిలిచారు. ఎట్టకేలకు వీరిద్దరూ విడాకులతో తమ బంధంతో తెంచుకున్నారు. హాలీవుడ్ చరిత్రలో వీరి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. జోలీ, జేమ్స్ సైమన్ విడిపోయినట్టు వారి లాయర్లు ప్రకటించారు. ఈ సమయంలో సైమన్ లాయర్ మీడియాతో మాట్లాడుతూ.. ఏంజెలీనా, బ్రాడ్ పిట్ నుంచి విడిపోయాలని ఎనిమిదేళ్ల క్రితమే విడాకులు దాఖలు చేశారు. ఆమె, ఆమె పిల్లలు పిట్‌తో పంచుకున్న ఆస్తులన్నింటినీ వదులుకున్నారు. వారు కుటుంబ శాంతి, వైద్యం దృష్ట్యా విడాకులు తీసుకున్నారనీ, వారి వివాహ బంధం ముగిసింది' అని పేర్కొన్నారు.
బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ ఆగస్టు 23, 2014న వివాహం చేసుకున్నారు. వీరి వివాహం ఫ్రాన్స్‌లోని తన ప్రైవేట్ వైన్యార్డ్ 'చాటో మిరావల్'లో జరిగింది. వీరి దంపతులు అనే మాడాక్స్, పాక్స్, జహారా, షిలోహ్,వివియన్, నాగ్స్ ఆరుగురు పిల్లలున్నారు. జోలీ సెప్టెంబర్ 19, 2016న విడాకుల కోసం దాఖలు చేసింది. పిల్లల ప్రాథమిక కస్టడీని డిమాండ్ చేశాడు. అప్పటి నుంచి పిల్లల సంరక్షణ, ఆస్తుల విభజన విషయంలో వీరి మధ్య న్యాయపోరాటం నడుస్తోంది.


Click it and Unblock the Notifications











