పాకిస్తాన్ కూడా సాయం అందిచండి..!
ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ప్రపంచంలోని అనేక నిరాశ్రయులకు చేయూతను అందిస్తున్న ఏంజలీనా జోలీ అందరి చేత వావ్ అనిపించుకుంటున్నారు. బోస్నియా యుద్ధంలో దారుణంగా నష్టపోయి దాదాపు 15 ఏళ్లుగా సొంత ఊరికి, ఉన్న ఆస్తులకు దూరమై దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్న వారికి తమ వంతు సాయం అందజేశారు. హాలీవుడ్ అందమైన జంట ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ ఎన్నో సార్లు తమ వంతు సాయం అందజేసి వాళ్శ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే ఇటీవల కాలంలో పాకిస్తాన్ లో భూకంపాలు, వరదలు సంభవించడం అందరికి తెలిసిందే. ఆ వరదలలో బాగా నష్టపోయిన వారి కోసం ఏంజలీనా జోలీ తనదైన శైలిలో ఒక వీడియో రూపోందించి వారికి సహాయం అందించవలసిందిగా కోరడం జరిగినది.
పాకిస్తాన్ వరద సహాయంగా తన వంతు గా 100,000 డాలర్స్ ని ఇవ్వడం జరిగినది. అంతేకాకుండా ఆమె మాట్లాడుతూ వరదల కారణంగా 17 మిలియన్ల జనాభా ఇబ్బందులకు గురయ్యారని, పాకిస్తాన్ లో ముప్పావు భాగం ఈ వరదల్లో మునిగి పోయిందని ఆమె వివరించారు. ఇటువంటి సమయంలో వారికి మన సపోర్ట్ ఎంతో అవసరం, అందుకని మనకు తోచినంత సాయం టెంట్స్, భోజనం, మంచి నీరు, మెడిసిన్స్ రూపంలో అందివ్వాలని కోరుకుంటున్నాను. ఐక్యరాజ్యసమితి వారియొక్క బాధలను అర్దం చేసుకోని 41మిలియన్ల డాలర్లు నుండి 120 మిలియన్ల డాలర్లు కు సాయాన్ని పెంచడం జరిగింది.


Click it and Unblock the Notifications











