Don't Miss!
- Sports SRH vs RCB: మలుపు తిప్పిన స్వప్నిల్ సింగ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆర్సీబీ ఘన విజయం!
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బోస్నియా ముస్లిమ్ మహిళను రేపు చేయడమే కాదు మాంచి రోమాన్స్ స్టోరీ కూడా ..
ఏంజిలినా జోలి తన అందం మరియు నటనతో యావత్ ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకుంది. ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ గా తనకు చేతనైనంత సహాయం చేస్తుంది. బోస్నియా యుద్ధం జరిగి దాదాపుగా 15 సంవత్సరాలు కావస్తుంది. ఇటీవల కాలంలో ఏంజలీనా జోలీ బోస్నియా జరిగిన చోటుకి వెళ్శారు. బోస్నియా యుద్ధంలో దారుణంగా నష్టపోయి దాదాపు 15 ఏళ్లుగా సొంత ఊరికి..ఉన్న ఆస్తులకు దూరమై దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్న అక్కడి నిరాశ్రయులు తమ జీవితం ఏ గమ్యం చేరుతుందో తెలియకపోయినా వారి పిల్లల భవిష్యత్తు కోసం పడుతున్న కష్టాలను, వారి తెగువను చూసి ఆమె చలించిపోయారు. ఏంజలీనా జోలీ మరియు బోస్నియా త్రి మెంబర్ ప్రిసిడెన్సి ఛైర్మన్ హారిస్ సిలాజ్ద్ జిక్ వీరిద్దరూ కలసి కూలంకుషంగా చర్చించి, మొట్టమొదటి ప్రాముఖ్యత 'చదువు'కి ఇవ్వాల్సిందిగా ఆమె కోరారని తన సపోర్టు ఎప్పటికీ బోస్నియా ప్రజలకు వుంటుందని ఆమె చెప్పారు. అలాగే రాబోయే సినిమాలను ఇక్కడే తీసి మీకు కోంత వరకు సాయం చేయడానికి తాను రెడీగా వున్నానని ఏంజిలినా జోలి వివరించిన విషయం అందరికి తెలిసిందే.
చెప్పిన విధంగానే తన మాటను నిలబెట్టుకున్నారు ఏంజిలినా జోలి. బోస్నియా యుద్దం మీద ఓ మంచి సినిమాని తీయడానికి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు తమకి సోమవారం పరిమిషన్ ఇచ్చారని సినిమా డైరెక్టర్ ఎడిన్ సారిక్ వెల్లడించారు. ఇక సినిమా విషయానికి వస్తే బోస్నియా ముస్లిమ్ మహిళను అక్కడున్న సెర్బ్ రేపు చేయడం జరుగుతుంది. దీనిపై స్పందించిన అక్కడున్న ముస్లిమ్ మహిళలు ఎలా స్పందించారనే చక్కని కధాంశంతో సినిమా రూపోందిస్తున్నామని డైరెక్టర్ తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా మాంచి రోమాంటిక్ గా కూడా ఉంటుందన్నారు. అంతేకాకుండా ఈసినిమా నిర్మాణం బోస్నియాలో జరుగుతున్న నేపధ్యంలో బోస్నియా గవర్నమెంట్ యొక్క పరిమిషన్ కూడా తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సినిమా ని ఏంజిలీనా జోలి ప్రోడక్షన్ మీద తీస్తుండంతో షూటింగ్ కి పరిమిషన్ ఇవ్వడం జరిగిందని వారు వివరించారు. అంతేకాకుండా ఏంజిలీనా జోలి మంచి మనసున్న వారిని, వారికోసం మేము ఇలా చేయడం జరిగిందని బోస్నియా గవర్నమెంట్ ప్రతినిధి హారిస్ సిలాజ్ద్ జిక్ వివరించారు. ఏంజలీనా జోలీ నవంబర్ చివరి వారంలో షూటింగ్ లో పోల్గోనడానికి బోస్నియా వస్తారని వారు వివరించారు.