అందరి నోళ్లలో నానుతున్న జంట ముచ్చట్లు...!!
హాలీవుడ్ క్రేజీ జంట ఏంజలీనా, బ్రాడ్ పిట్ లు ఈ మధ్య తరచుగా గొడవ పడుతున్నారని, త్వరలోనే విడిపోనున్నారని లాన్ హాల్పెరిన్ తను రాసిన పుస్తకం 'బ్రాంజలీనా'లో ప్రకటించడం హాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. వారిద్దరూ కలసిన తొలిరోజుల్లో వీరివురూ రోజుకు 18 నుండీ 20 గంటల పాటు పడకగదిలో గడిపేవారని చెప్పి, వారి రొమాంటిక్ లైఫ్ మీద దృష్టి కేంద్రీకరించినట్టు చెప్పకనే చెప్పాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ముందున్నంత సాన్నిహిత్యం లేదని, అది రోజురోజుకి తగ్గిపోతోందని ఆయన తెలిపారు. అంతే కాదు ఏంజలీనా చాలా పొసెసివ్ అని, బ్రాడ్ ను ఒక్కడినే బయటకు వెళ్లనివ్వదని, ఎక్కడికెళ్లినా తనతో వుండాలని కోరుకుంటుందని తెలిపారు. దీనిపై తనెంతో మంది అభిప్రయాలను సేకరించానని, వారందించిన వివరాల ప్రకారం వీరిద్దరూ వచ్చే క్రిష్ట్ మస్ నాటికి విడిపోనున్నారని తెలిపిన సంగతి తెలిసిందే.
కాగా ఈ పుస్తకం విడుదలయ్యి ఈ వార్త అందరి నోటా నానుతున్నా ఏంజలీనా, బ్రాడ్ లు కలసి ఓ డిన్నర్ వార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీలో వీరిద్దరూ ఎంతో ఉల్లాసంగా గడిపారు. వీరిద్దరి అన్యోన్యతను చూసిన వారు వీరు విడుపోనున్నారనే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, కేవలం తన పుస్తకాన్ని సేల్ చేసుకోవడానికే హాల్పెరిన్ ఈ విధంగా రాసాడని అనుకుంటున్నారు. కానీ కొంత మంది మాత్రం లేదు వీరిద్దరూ విడిపోనున్నారని అనుకుంటున్నారు. అలా హాలీవుడ్ ఏ ఇద్దరు పోగయినా వీరిద్దరి సంబంధం గురించే మాట్లాడుకుంటున్నారట. అయినా వీరు విడిపోనున్నార్, కలసి వుండనున్నారో...?? ఎవరికి తెలుసు...!! లోగుట్టు పెరుమాళ్ళుకెరుక....!!


Click it and Unblock the Notifications











