twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నైబర్స్ నుండి ఘన స్వాగతం అందుకున్న సూపర్ స్టార్స్

    By Nageswara Rao
    |

    లండన్: హాలీవుడ్‌లో తమకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న జంట ఏంజిలీనా జోలీ, బ్రాడ్ పిట్. బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ మళ్లీ తిరిగి లండన్‌లో నివసించడానికి వచ్చిన సందర్బంలో ఆ ఇంటి చుట్టుప్రక్కల వాళ్లు నివసిస్తున్న వారంతా ఈ జంటకు స్వాగతం పలికారు. బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ గతంలో లండన్‌లోని రిచ్‌మండ్ ప్రాంతంలో నివసించిన విషయం తెలిసిందే. సంవత్సరం తర్వాత తిరిగి మరలా ఈ ప్రాంతంలో నివసించేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడకు రాడవంతో అక్కడున్న వారు ఈ జంటకు ఘన స్వాగతం పలికారు.

    చుట్టుప్రక్కల నివసించే వారు బ్రాడ్ పిట్‌తో ఇంటర్ కామ్‌లో సమీపంలో ఉన్న గోల్ప్ కోర్సులో ఆడడానికి ఆహ్వానించారు. ఒక వేళ తాను ఏమీ సంపాదించలేకుంటే క్లబే స్వయంగా రూణాలు మంజూరు చేస్తుందని తెలిపారు. అంతేకాదండోయ్ ఎవరైనా కొత్తగా ఇంటి ప్రక్కకు వస్తే ఇంగ్లీషు సాంప్రదాయం ప్రకారం వారికి స్వాగతం పలుకుతూ బాస్కెట్స్(వెల్ కమ్ గిప్ట్స్)ని అందించారు. బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీతో పాటు వారి ఆరుగురు పిల్లలు మాడక్స్, ప్యాక్స్, షైలో, జహారా, వివిన్నీ, నాక్స్ అందరికి ఘన స్వాగతం పలికారు.

    బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీలు లండన్‌లో £10మిలియన్లు పెట్టి ఓ మాన్షన్‌ని సొంతం చేసుకున్నారు. 'వోర్నీస్ ప్లేస్' పేరుతో ఉన్న ఈ మాన్షన్‌ని కోనుగోలు చేయడానికి గల కారణం.. గత వేసవిలో బ్రాడ్ పిట్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'వరల్డ్ వార్ జడ్' సినిమా షూటింగ్ సందర్బంలో బ్రాడ్ పిట్, జోలీలతో పాటు వీరి ఆరుగురు పిల్లలు ఇదే మాన్షన్‌లో నెలకు £30,000 అద్దె చెల్లించి మరీ నివసించారు.

    ఈ మాన్షన్‌లో ఇండోర్ స్విమ్మింగ్ పూల్, 15వ శతాబ్దానికి చెందిన చెక్కతో ఈ ఇంటిని నిర్మించారు. బ్రాడ్ పిట్, జోలీల అధికార ప్రతినిధి మాట్లాడుతూ లండన్‍‌లో వీరు ఈ ఇంటిని కోనుగోలు చేయడంతో బ్రిటన్‌పై వారికి ఎంత ఆప్యాయత ఉందో తెలిసిపోతుందని అన్నాడు. ఇటీవలే నిశ్చితార్దం ముగించుకోని .. త్వరలో పెళ్లి చేసుకోనున్న ఈ జంట అందరికి హాలీవుడ్‌కి ఆదర్శంగా నిలవడంతో పాటు పలు సేవా కార్యక్రమాలలో తమ వంతు సహాయం అందిస్తున్నారు. బ్రాడ్ పిట్, జోలీలు లండన్‌లో కోనుగోలు చేసిన ఇంటికి దగ్గర లోనే హాలీవుడ్ స్టార్ హీరోలు జార్జి క్లూనీ, జానీ డెప్, ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ సాంద్రా బుల్లక్‌లు నివసిస్తున్నారు.

    English summary
    Celebrity actor couple Angelina Jolie and Brad Pitt have been given a warm welcome by their neighbours when they returned here.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X