ఆ అతిధి మర్యాదలు జీవితంలో మర్చిపోలేనివి
హాలీవుడ్ అందాల జంట బ్రాడ్‌పిట్, ఏంజిలీనా జోలీ ఇటీవల బోస్నియాలోని నేషనల్ ధియేటర్‌లో జరిగిన 17వ సారజీవో ఫిల్మ్ ఫెస్టివల్ కి హాజరవ్వడం జరిగింది. 36సంవత్సరాల వయసు కలిగినటువంటి ఏంజిలీనా జోలీ తనదైన స్టయిల్‌లో కారం రంగు కలిగిన గౌనులో తన భర్త ప్రక్కనే నుంచోని అభిమానులకు ధన్యవాదాలు చేసిన తీరు అధ్బుతం. అసలు ఏంజిలీనా జోలీ బోస్నియా రావడానికి కారణం 'హానరరీ హార్ట్ ఆప్ సారజీవో అవార్డు'తో ఏంజిలీనా జోలీని సత్కరించడం జరిగింది.
ఈ సందర్బంలో ఏంజిలీనా జోలీ మాట్లాడుతూ ఈ అందమైన దేశంలో నేను పోయిన సంవత్సరం నా జీవితంలో కొంత సమయాన్ని ఈ సిటీలో గడపడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అందించినటువంటి ఆదరాభిమానాలు నా జీవితంలో మరచిపోలేని విధంగా అందించారు. ముఖ్యంగా ఇక్కడున్నటువంటి లోకల్ పీపుల్స్‌లో ఉన్న టాలెంట్ అమోఘం అంటూ వారిని ఆకాశానికి ఎత్తివేశారు. నా సినీ జీవితంలో ఎంతో మంది లోకల్ పీపుల్స్‌తో సినిమాలు తీయడం జరిగింది. నిజంగా ఈ బోస్నియా సిటీలో ఉన్న లోకల్ పీపుల్‌తో కలసి పనిచేయడం నా అదృష్టం అని అన్నారు. ఇది ఇలా ఉంటే ఏంజిలీనా జోలీ నటించిన 'ల్యాండ్ ఆప్ బ్లడ్ అండ్ హానీ' సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా పోయిన సంవత్సరం బోస్నియా సిటీలో తీయడం జరిగింది.
ఈ సినిమాలో ముఖ్యంగా బోస్నియా యుద్దం గురించిన సమాచారం కళ్లకు కట్టినట్లు చూపించడానికి ఏంజిలీనా జోలీ ప్లాన్ చేసినట్లు వినికిడి. ఇందులో ఏంజిలీనా జోలీ ఓ ముస్లిం యువతిగా నటించనున్నారని సమాచారం. యుద్దం జరిగిన తర్వాత అక్కడి ప్రజలు పడినటువంటి కష్టాలు, అంతేకాకుండా బోస్నియా మహిళలు సైనికలు చేత ఏవిధంగా హింసించ బడ్డారో ఈ సినిమాలో చూపించనున్నారు.


Click it and Unblock the Notifications











