twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏంజలీనా జోలీ, బ్రాడ్ ఫిట్ పెళ్లి ఫోటో ఇదే...

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ టాప్ స్టార్స్ ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఆగస్టు 23వ తేదీన ఫ్రాన్స్‌లో వీరు క్రైస్తవ సాంప్రదాయ బద్దంగా వివాహం చేసుకుని ఏకమయ్యారు. పూర్తి ప్రైవేట్ సెర్మనీగా జరిగిన వీరి వివాహ ఫోటోలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. తాజాగా పీపుల్ మేగజైన్, హలో మేగజైన్ వీరి ఫోటోలను తమ తాజా సంచికలో ప్రచురించాయి.

    ప్రత్యేకంగా డిజైన్ చేసిన వివాహ దస్తుల్లో ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ అందంగా మెరిసి పోయారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ వారిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దాదాపు దశాబ్దకాలం సహజీవనం తర్వాత హాలీవుడ్ సెక్సీ జోడీ బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీ పెళ్లి చేసుకున్నారు. దంపతులయ్యారు. 2005 నుండి కలిసి సహజీవనం చేస్తున్న ఈ ఇద్దరూ 2012లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫ్రాన్స్‌లో వీరి వివాహం జరిగింది.

    Angelina Jolie, Brad Pitt Wedding Pics Out! Checkout The Bride

    పెళ్లికి ముందే ఈ జంట ముగ్గు పిల్లలకు జన్మనివ్వగా...మరో ముగ్గురిని దత్తత తీసుకున్నారు. హాలీవుడ్ హాట్ జోడీ అయిన బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలిలను కలిపి......ముద్దుగా ‘బ్రాంజలీనా' అని పిలుచుకుంటారు అభిమానులు. మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా వీరు పేరు తెచ్చుకున్నారు.

    2005లో వచ్చిన ‘మిస్టర్ అండ్ మిస్టర్స్ స్మిత్' చిత్రంలో కలిసి నటించిన ఈ జోడీ ప్రేమలో పడి పోయాడు. అనంతరం బ్రాడ్ తన భార్య జెన్నిఫర్ ఆనిస్టిన్ నుంచి విడాకులు తీసుకున్నారు. ఏంజెలినాకు అప్పటికి రెండుసార్లు వివాహమైంది. ఆమె గతంలో జానీ లీ మిల్లర్, బిల్లీ బాబ్ థ్రాంటన్‌లను పెళ్లాడి విడిపోయారు.

    English summary
    People magazine landed the much-coveted celebrity wedding pics of 2014. It is none other than our stunning new bride Angelina Jolie who tied the knot with her long time partner, Brad Pitt in a private ceremony in France last month on 23rd August, 2014.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X