Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఏంజలీనా జోలీ, బ్రాడ్ ఫిట్ పెళ్లి ఫోటో ఇదే...
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ టాప్ స్టార్స్ ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఆగస్టు 23వ తేదీన ఫ్రాన్స్‌లో వీరు క్రైస్తవ సాంప్రదాయ బద్దంగా వివాహం చేసుకుని ఏకమయ్యారు. పూర్తి ప్రైవేట్ సెర్మనీగా జరిగిన వీరి వివాహ ఫోటోలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. తాజాగా పీపుల్ మేగజైన్, హలో మేగజైన్ వీరి ఫోటోలను తమ తాజా సంచికలో ప్రచురించాయి.
ప్రత్యేకంగా డిజైన్ చేసిన వివాహ దస్తుల్లో ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ అందంగా మెరిసి పోయారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ వారిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దాదాపు దశాబ్దకాలం సహజీవనం తర్వాత హాలీవుడ్ సెక్సీ జోడీ బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీ పెళ్లి చేసుకున్నారు. దంపతులయ్యారు. 2005 నుండి కలిసి సహజీవనం చేస్తున్న ఈ ఇద్దరూ 2012లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫ్రాన్స్‌లో వీరి వివాహం జరిగింది.
పెళ్లికి ముందే ఈ జంట ముగ్గు పిల్లలకు జన్మనివ్వగా...మరో ముగ్గురిని దత్తత తీసుకున్నారు. హాలీవుడ్ హాట్ జోడీ అయిన బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలిలను కలిపి......ముద్దుగా ‘బ్రాంజలీనా' అని పిలుచుకుంటారు అభిమానులు. మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా వీరు పేరు తెచ్చుకున్నారు.
2005లో వచ్చిన ‘మిస్టర్ అండ్ మిస్టర్స్ స్మిత్' చిత్రంలో కలిసి నటించిన ఈ జోడీ ప్రేమలో పడి పోయాడు. అనంతరం బ్రాడ్ తన భార్య జెన్నిఫర్ ఆనిస్టిన్ నుంచి విడాకులు తీసుకున్నారు. ఏంజెలినాకు అప్పటికి రెండుసార్లు వివాహమైంది. ఆమె గతంలో జానీ లీ మిల్లర్, బిల్లీ బాబ్ థ్రాంటన్లను పెళ్లాడి విడిపోయారు.