నా కూతురు పెళ్లి చేసుకుంటుందా.. నాకు తెలియదు
యుఎస్ వీక్లీ కథనం ప్రకారం జాన్ వాయిట్ తన కుమార్తె ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్‌ని వివాహం చేసుకుందంటూ వచ్చిన వార్తలపై స్పందించమని అడగగా ఈ పెళ్లి వార్త విని ఆశ్చర్యాన్ని ప్రకటించి.. ఆ తర్వాత నా కూతురు ఏంజిలీనా జోలీ పెళ్లి చేసుకోబోతుందా అంటూ ఎదురు ప్రశ్నించాడు. ఏంజెలీనా జోలీ ఆమె తండ్రి జాన్ వాయిట్ మధ్య గల పొరపొచ్చాలను అధిగమించడానికి కానీ ఒక తండ్రి కుమార్తె లాగా కలిసి పని చేసేలా కనిపించడం లేదు. ఏంజిలీనా జోలీ, బ్రాడ్ పిట్ పెళ్లి గురించి నా వద్ద ఎటువంటి సమాచారం లేదని అన్నాడు. అందరి లాగే నేను మీడియా ద్వారానే ఈ న్యూస్‌ని తెలుసుకున్నానని అన్నారు.
73 సంవత్సరాల వయసు కలిగిన జాన్ వాయిట్ తన కుమార్తె జోలీ, బ్రాడ్ పిట్‌ని పెళ్లి చేసుకుంటున్న విషయం నాతో ఇంకా చర్చించలేదని అన్నారు. ఇటీవల కాలంలో వీరిద్దరూ కలవక పోయినప్పటికీ ఏంజిలీనా జోలీ మానవతా విలువలు కలిగిన వ్యక్తిగా పొగడ్తలతో ముంచెత్తాడు. ఏంజిలీనా జోలీ చాలా ప్రత్యేకం అని అన్నాడు.
జోలీ బోస్నియా గౌరవ పౌరసత్వాన్ని అందుకోనున్నారు. ఇటీవల ఏంజిలీనా జోలీ దర్శకత్వ పర్యవేక్షణలో 'ఇన్ ద ల్యాండ్ బ్లడ్ అండ్ హానీ' సినిమా విడుదల చేసి అక్కడి ప్రజల మన్ననలను పొందిన విషయం తెలిసిందే. ఏంజిలీనా జోలీకి ఈ గౌరవాన్ని మే 3వ తారీఖున బోస్నియా రాజధాని 'సారజీవో' లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫంక్షన్ ఇవ్వనున్నట్లు బోస్నియా ప్రతినిధులు తెలిపారు.
1990లో జరిగిన యథార్ద గాథ ఆధారంగా ఏంజిలీనా జోలీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో యుద్ద సమయంలో అలనాడు జరిగిన సంఘటలను కళ్లకు కళ్లినట్లు చూపించారు. అంతేకాకుండా ఓ సెర్బియన్ సోల్జర్, బోస్నియా మహిళ మధ్య చూపించిన రొమాన్స్ ఈ సినిమాకి హైలెట్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications











