స్టార్ హీరోయిన్ గా వెలుతోంది...అయినా డైరక్టర్ అవుతోంది

By Srikanya

లాస్ ఏంజిల్స్ : ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ మరోసారి దర్శకత్వ బాధ్యతలను తలకెత్తుకోనుంది. ఈసారి 'ఆఫ్రికా' పేరుతో ఓ జీవిత చరిత్ర (బయోపిక్‌)ను తెరకెక్కించనుంది. దీనికి ఆమె సహనిర్మాత కూడా. కెన్యా రాజకీయవేత్త, ప్రాచీన మానవజాతి పరిశోధకుడు (పాలియాంత్రోపాలజిస్ట్‌), వేటగాళ్ల బారి నుంచి ఆఫ్రికా ఏనుగుల సంరక్షణ కోసం పోరాటం జరిపిన రిచర్డ్‌ లీకీ జీవిత కథతో సినిమా నిర్మితమవుతుంది.

Angelina Jolie to direct ivory poaching tale 'Africa'

ఈయన కథను ఆస్కార్‌ విజేత అయిన రచయిత ఎరిక్‌ రాత్‌ రాశారు. జోలీ తొలిసారిగా 2011లో 'ఇన్‌ ద ల్యాండ్‌ ఆఫ్‌ బ్లడ్‌ అండ్‌ హనీ' సినిమాకు దర్శకత్వం వహించింది. ఇప్పుడు తన భర్త బ్రాడ్‌పిట్‌తో కలసి నటిస్తూ 'బై ద సీ' సినిమాకు దర్శకత్వం వహిస్తోంది.

అలాగే రీసెంట్ గా ఆమె వివాహ వ్యవస్థపై ఓ పుస్తకం రాసింది. అలాగే రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో 'అన్‌బ్రోకెన్‌' సినిమా కూడా ఆమె చేతుల్లో ఉంది. నటిగా రిటైర్‌ అవుతానని చెబుతున్న జోలీ ఇకపై తెర వెనక పాత్రలకే పరిమితమవుతుందేమో అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ విషయమై ఆమె అధికారికంగా ఏ ప్రకటనా చేయలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X