సీక్రెట్ మ్యారేజి ప్లాన్స్ లేవన్న స్టార్ హీరోయిన్
హలీవుడ్ అందమైన పెదాల రాణి ఏంజిలీనా జోలీ తను నటించి, దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా 'ఇన్ ద ల్యాండ్ ఆఫ్ బ్లెడ్ అండ్ హానీ' గురించి తన అనుభవాలను పంచుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్ వ్యానిటీ ఫెయిర్ అక్టోబర్ ఎడిషన్ కవర్ పేజిపై తన ఇంటర్యూని ఇస్తూ క్రింది విషయాలను తెలియజేశారు. ఏంజిలీనా జోలీ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'ఇన్ ద ల్యాండ్ ఆఫ్ బ్లెడ్ అండ్ హానీ' సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కోవడం జరిగింది. ఈ సినిమా ముఖ్య కధాంశం ఏమిటంటే బోస్నియా సివిల్ యుద్దం జరిగిన తర్వాత ఇద్దరూ వ్యక్తలు మద్య జరిగిన ప్రేమను కధగా తీసుకొని సినిమా తీయడం జరిగింది.
ఇంత ఖరీదైన కళాత్మక విలువలు కలిగిన సినిమాని తీయడానికి నా భర్త బ్రాడ్ పిట్ సహాకారం మరువలేదని అన్నారు. ఇక సినిమా నిర్మాణం తీసే సమయంలో నేను ఛాలెంజెస్‌ని ఎదుర్కోవడం జరిగింది. సాధారణంగా నేను ఎప్పుడూ పెద్దగా వార్తల్లో ఎక్స్ పోజ్ కాలేదు. నా జీవితంలో వేరే వాళ్లు కధలు రాస్తే వాటిని నటించడం వరకు మాత్రమే చేశాను. దీని అర్దం ఏమిటంటే ఎప్పుడూ కూడా నేను వారి మాటలు వెనుక ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించడం వల్ల నేను మాట్లాడాల్సి వచ్చింది. సెట్లో ఎవరైనా తప్పు చేస్తే నేను కొంచెం గట్టిగా మాట్లాడిన సందర్బాలు కూడా ఉన్నాయి.
చివరగా ఈ సినిమా గురించి చెప్పాలంటే తప్పకుండా బ్రాంజిలినా అభిమానులకు నచ్చుతుంది. ఎందుకంటే ఒకరకంగా చెప్పాలంటే ఇది ఓ యదార్ద గాధ. ఇక ప్రస్తుతం వార్తల్లో వచ్చినట్లు మేము ఇద్దరం కూడా ఎటువంటి సీక్రెట్ మ్యారేజికి ప్లాన్ చేయలేదు. అటువంటి అవసరం కూడా మాకులేదని తేలికగా కొట్టిపారేశారు. ఈ సినిమాని ప్రపంచం మొత్తం డిసెంబర్ 23న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు జోలీ తెలిపారు.


Click it and Unblock the Notifications











